ఉక్రెయిన్‌కు భారత్ సాయం

ABN , First Publish Date - 2022-03-02T22:42:58+05:30 IST

రష్యా దాడితో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు భారత్ సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి వినతి మేరకు అత్యవసరమైన మెడిసిన్లతోపాటు బ్లాంకెట్లు, టెంట్లు, సోలార్ ల్యాంప్స్ సహా ఇతర సామగ్రి అందించింది.

ఉక్రెయిన్‌కు భారత్ సాయం

రష్యా దాడితో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు భారత్ సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి వినతి మేరకు అత్యవసరమైన మెడిసిన్లతోపాటు బ్లాంకెట్లు, టెంట్లు, సోలార్ ల్యాంప్స్ సహా ఇతర సామగ్రి అందించింది. పోలండ్ ద్వారా బుధవారం రెండు టన్నుల విలువైన మెడిసిన్స్‌ను ఉక్రెయిన్‌కు తరలించింది. త్వరలో రొమేనియా ద్వారా మరికొంత సాయం అందించేందుకు భారత్ సిద్ధమవుతోంది. అత్యవసరానికి వినియోగమయ్యే సామగ్రిని ఉక్రెయిన్‌కు తరలిస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన సీ 17 విమానం ద్వారా భారతీయులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2022-03-02T22:42:58+05:30 IST