జపాన్‌లో అత్యవసర పరిస్థితి విధింపు

ABN , First Publish Date - 2021-07-31T22:46:38+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం ఆగస్టు

జపాన్‌లో అత్యవసర పరిస్థితి విధింపు

టోక్యో : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం ఆగస్టు 31 వరకు జపాన్ కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఆ దేశ ప్రధాన మంత్రి యొషిహిడే సుగ కార్యాలయం శనివారం ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలను వెల్లడించింది. 


టోక్యో, సైటమ, చీబా, కనగవ, ఒసాకా, ఒకినావా ప్రిఫెక్సర్లలో ఆగస్టు 31 వరకు అత్యవసర పరిస్థితిని విధించడంతోపాటు, హొక్కాయిడో, ఇషికావా, క్యోటో, హ్యోగో ప్రిఫెక్చర్లలో ప్రత్యేక చర్యలను అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఈ చర్యలను ప్రకటించింది. 


దేశవ్యాప్తంగా జూలై 29న 10,699 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే రోజు కొత్తగా 3,865 కేసులు నమోదైనట్లు టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం తెలిపింది. 


టోక్యో, ఒకినావాలలో ఆగస్టు 22తో అత్యవసర పరిస్థితి ముగుస్తుందని పీఎంఓ పేర్కొంది. యువతకు వ్యాక్సినేషన్ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపింది. జనాభాలో 40 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను ఆగస్టు చివరి వారానికి పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. 50 ఏళ్ళ వయసు పైబడినవారిలో తీవ్రమైన వ్యాధులుగలవారికి కూడా టీకాలు ఇవ్వడంపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. 


అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు జపాన్ ప్రభుత్వం సలహా ఇచ్చింది. వేసవి కాలంలో ప్రయాణాలు చేసి, తిరిగి వచ్చేటపుడు చాలా జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. 


Updated Date - 2021-07-31T22:46:38+05:30 IST