అత్యవసర సమయాల్లో సైతం సేవలందించాలి

ABN , First Publish Date - 2020-07-03T11:28:53+05:30 IST

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రులకు వచ్చే పోలీసు సిబ్బందిని ఎంత ఎమర్జెన్సీ ఉన్నా అడ్మిట్‌ చేసుకుని సేవలందించాలని

అత్యవసర సమయాల్లో సైతం సేవలందించాలి

వైద్యులతో పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌


వరంగల్‌ అర్బన్‌ క్రైం, జూలై 2: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రులకు వచ్చే పోలీసు సిబ్బందిని ఎంత ఎమర్జెన్సీ ఉన్నా అడ్మిట్‌ చేసుకుని సేవలందించాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ అన్నారు. హన్మకొండలోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం సీపీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా   వైద్యులు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా సీపీ ప్రమోద్‌కుమార్‌ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కుటుంబాలకు సైతం దూరంగా ఉండి విధులు నిర్వర్తిస్తారన్నారు. వారికి అత్యవసర సమయాల్లో సైతం సేవలందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో అదనపు డీసీపీలు వెంకటలక్ష్మి, తిరుపతి, గిరిరాజు, భీంరావ్‌, ఏసీపీలు జనార్ధన్‌, జితేందర్‌రెడ్డి, ప్రతాప్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు దయాకర్‌, గణేష్‌, ఆర్‌ఐలు భాస్కర్‌, శ్రీనివాసరావు, పోలీసు అధికారుల సంఘం నాయకుడు అశోక్‌, ఐఎంఏ అధ్యక్షుడు కొత్తగట్టు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-03T11:28:53+05:30 IST