జగిత్యాలపై ఎమ్మెల్సీ కవిత దృష్టి

ABN , First Publish Date - 2021-06-15T06:25:26+05:30 IST

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత జగిత్యాల జిల్లాపై తనదైన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు.

జగిత్యాలపై ఎమ్మెల్సీ కవిత దృష్టి
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ కవిత

అటు రాజకీయం....ఇటు అభివృద్ధిపై నజర్‌

కీలక పదవులన్నింటిలో కవిత అనుచరులే

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ముందస్తు వ్యూహం

జగిత్యాల, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత జగిత్యాల జిల్లాపై తనదైన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. అ టు రాజకీయ రంగంలో ఇటు అభివృద్ధిలో తనదైన ముద్ర ఉండే విధం గా ఎమ్మెల్సీ కవిత వ్యవహిరస్తున్నారు. గతంలో తాను ప్రాతినిత్యం వహించిన నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని సెగ్మెంట్‌లలో పట్టు చె క్కు చెదరకుండా ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. నిజామాబాద్‌ పార్లమెం ట్‌ నియోజకవర్గ పరిధిలో గల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సె గ్మెంట్‌లలో తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ, పా ర్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆశించిన ఫలితాలు అందించడానికి ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం లో కీలకమైన పదవులన్నీ ఎమ్మెల్సీ కవిత అనునాయులకు దక్కించుకుం టున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వరకు అన్ని పదవులు కవిత కనుసన్నలతోనే దక్కుతున్నాయి. తాజాగా జిల్లా గ్రంథా లయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పదవి సైతం ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో దక్కిందన్న ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. జిల్లాకు ఎటువంటి సంబందం లేని నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కవిత వ్యవహరిస్తున్నప్పటికీ జగిత్యాల పరిపాలన, అభివృద్ధి, రాజకీయంలో తనదైన ప్రభావాన్ని కన బరుస్తున్నారు. 

గతంలో ఎంపీగా...ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రజల్లో చెరగని ముద్ర....

గతంలో నిజామాబాద్‌ ఎంపీగా ప్రాతినిత్యం వహించిన సమయంలో కల్వకుంట్ల కవితదే హవా నడిచింది. అడుగడుగున తనదైన పాలనను అందిస్తూ ప్రజల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. ఐదేళ్లుగా జగిత్యాల లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు నిధు లను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సమీకరించడానికి కీలక పాత్ర పో షించారు. జిల్లాలో భారీ ఎత్తున డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, హైద్రాబాద్‌ తదుపరి జగిత్యాలలో సుమారు 4 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లతో కూడిన అతిపెద్ద క్లస్టర్‌ ఏర్పాటు, రాయికల్‌ మండలంలోని బోర్న పల్లి వంతెన నిర్మాణం కావడంలో ఆమే కీలకంగా వ్యవహరించారు. జి ల్లాలో ధర్మపురి, రాయికల్‌ మున్సిపాల్టీల ఏర్పాటు, బీర్పూర్‌ మండలం ఏర్పాటుకు చొరవ ప్రదర్శించారు. తాజాగా మామిడి పండ్ల మార్కెట్‌ అభివృద్ధికి, జగిత్యాలలో మాతా శిశు కేంద్రం ఏర్పాటు, మున్సిపాల్టీల్లో అ భివృద్ధికి నిధుల మంజూరు సహకారాలను అందించి మార్క్‌ రాజకీ యా న్ని ప్రదర్శిస్తున్నారు. జగిత్యాలకు మెడికల్‌ కళాశాల, ఆసుపత్రి మంజూ రులో సైతం తనదైన పాత్రను పోషించారు.

పదవుల్లో అనుచరులకు పెద్ద పీట....

జగిత్యాల జిల్లాలో పదవుల్లో అనుచరులకు పెద్ద పీట వేస్తున్నారు. గతంలో కౌన్సిలర్‌ నుంచి జడ్పీ చైర్మన్‌ వరకు అన్ని స్థానాల్లో అనుయా యులకు అవకాశాలు కల్పించారు. మార్కెట్‌ కమిటీ పాలకవర్గాలు, దేవా లయాల పాలకవర్గాలు ఇలా పలు నామినేటేడ్‌ పదవులు సైతం కవిత ఆశీస్సులతో దక్కుతున్నాయన్న ప్రచారం ఉంది. తాజాగా జగిత్యాల జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పదవితో పాటు డైరెక్టర్ల పదవులు సైతం అనునయులకు ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. జిల్లా మంతి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల విద్యా సాగర్‌ రావు, రవిశంకర్‌లతో కలిసి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ జగిత్యాల జిల్లాపై మరింత నజర్‌ను పెంచుతున్నారు. ఇటీవల జిల్లాలోని మల్యాల మండలంలో గల కొండగట్టు హనుమాన్‌ దేవస్థానాన్ని సంద ర్శించి అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల పెంపుదలపై దృష్టి సారించా రు. ఈనెల 15న జగిత్యాలలో జరగనున్న జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎ మ్మెల్సీ కవిత హాజరై తనదైన ప్రాధాన్యతను చాటడానికి సిద్ధమవు తున్నారు.

పార్టీ మరింత బలోపేతంపై నజర్‌...

జగిత్యాల జిల్లాలో టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయడానికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా జగిత్యాల అసెం బ్లీ సెగ్మెంట్‌ రాజకీయాలపై తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు. జగి త్యాల జిల్లాలో గులాబీ జెండాను రెపరెపలాడించడానికి నిజామాబాద్‌ ఎంపీగా వ్యవహరిస్తున్న సమయంలో తనదైన చొరవను చూపించారు. ఇటీవల జిల్లాలో బీజేపీ రామనామ జపానికి ధీటుగా కొండగట్టులో జై హనుమాన్‌ పారాయాన్ని ప్రారంభించి హనుమ భక్తులను ఆకర్శింపజే యడానికి ప్రయత్నించారు. రాజకీయ సమీకరణలను మార్పు చేసి టీఆర్‌ ఎస్‌ను మరింత బలోపేతం చేయడానికి ఎమ్మెల్సీ తెరవెనుక రాజకీయం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఏదీ ఏమైనా గతంలో నిజామాబాద్‌ ఎంపీగా వ్యవహరించిన సమయంలో కవిత తనదైన చొరవను ప్రదర్శిం చడం, ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నప్పటికీ జగిత్యాల జిల్లాపై తన మార్క్‌ చెక్కుచెదరకుండా వ్యవహరిస్తుండడం రాజకీయ వర్గాల్లో చ ర్చనీయాంశంగా మారింది.


Updated Date - 2021-06-15T06:25:26+05:30 IST