రెండో రోజు కొనసాగిన వెబ్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-10-25T06:44:19+05:30 IST

ఏపీ ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కాకినాడలోని జేఎన్టీయూ, ఏపీటీ సహాయ కేంద్రాల్లో శనివారం కౌన్సెలింగ్‌ను కొనసాగించారు.

రెండో రోజు కొనసాగిన వెబ్‌ కౌన్సెలింగ్‌

 జేఎన్టీయూకే, అక్టోబరు 24: ఏపీ ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కాకినాడలోని జేఎన్టీయూ, ఏపీటీ సహాయ కేంద్రాల్లో శనివారం  కౌన్సెలింగ్‌ను కొనసాగించారు. 20,001 నుంచి 35,000 ర్యాంకు వరకు జేఎన్టీయూకేలోని యూసీఈకే సహాయ కేంద్రంలో 216 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. అలాగే ఏపీటీలోని సహాయ కేంద్రంలో 35,001 నుంచి 50,000 ర్యాంకు వరకు 122 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. పరిశీలనకు మొత్తం 338 మంది హాజరైనట్టు సహాయ కేంద్రాల సమన్వయ కర్తలు తెలిపారు. 50,001 నుంచి 65,000 ర్యాంకు వరకు యూసీఈకే సహాయ కేంద్రంలోను, 65,001 నుంచి 80,000 ర్యాంకు గల విద్యార్థుల ధ్రువపత్రాలను ఏపీటీ సహాయ కేంద్రంలోను ఆదివారం పరిశీలించనున్నారు.

Updated Date - 2020-10-25T06:44:19+05:30 IST