రేపే Emcet ఫలితాలు?

ABN , First Publish Date - 2022-08-11T17:07:50+05:30 IST

ఎంసెట్‌ ఫలితాల(Emcet results)ను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ ఫలితాలను ఎప్పుడు వెల్లడిస్తారనేదానిపై అధికార ప్రకటన ఏదీ విడుదల కాలేదు. ఎంసెట్‌ ఫలితాలతో పాటు, ఈ-సెట్‌

రేపే Emcet ఫలితాలు?

డీఈ-సెట్‌ ఫలితాల విడుదల


హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ ఫలితాల(Emcet results)ను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ ఫలితాలను ఎప్పుడు వెల్లడిస్తారనేదానిపై అధికార ప్రకటన ఏదీ విడుదల కాలేదు. ఎంసెట్‌  ఫలితాలతో పాటు, ఈ-సెట్‌ ఫలితాలను కూడా శుక్రవారం వెల్లడించడానికి వీలుగా అధికారులు ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిసింది. కాగా డీఈ-సెట్‌ ఫలితాలను వెల్లడించారు. తెలుగు మీడియంలో 77.40 శాతం, ఇంగ్లిషు మీడియంలో 78.81 శాతం, ఉర్దూ మీడియంలో 59.41% ఉత్తీర్ణత నమోదైనట్లు సెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసాచారి ప్రకటించారు. కాగా పాఠశాల విద్యార్థులకు అందించే మిడ్‌ మే మీల్స్‌లో అందించే గుడ్డు ధరను పెంచారు. విద్యార్థులకు వారానికి మూడు రోజుల పాటు ఉడికించిన కోడి గుడ్డును ఇవ్వాలి.. ఇప్పటి వరకు ఒక్కో గుడ్డుకు రూ.4 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. గుడ్డు ధరను రూ.5కు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేశారు.  

Updated Date - 2022-08-11T17:07:50+05:30 IST