కరోనా టీకా.. కువైట్‌లోని భారత ఎంబసీ కీలక సూచన!

ABN , First Publish Date - 2021-03-18T13:44:21+05:30 IST

కువైట్‌లోని భారత ఎంబసీ కరోనా టీకా విషయమై తాజాగా భారత ప్రవాసులకు కీలక సూచన చేసింది.

కరోనా టీకా.. కువైట్‌లోని భారత ఎంబసీ కీలక సూచన!

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత ఎంబసీ కరోనా టీకా విషయమై తాజాగా భారత ప్రవాసులకు కీలక సూచన చేసింది. తప్పకుండా వ్యాక్సిన్ కోసం ఆరోగ్యశాఖ వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. ఇలా టీకా కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి చాలా సులువుగా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కువైట్‌లో నివసిస్తున్న ప్రవాసులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం https://cov19vaccine.moh.gov.kw/SPCMS/CVD_19_Vaccine_Registration.aspx లింక్‌ను వినియోగించుకోవాలని సూచించింది.


ఈ పద్దతిలో ఫామ్ ఫీలింగ్ కోసం సివిల్ ఐడీ నెంబర్, సివిల్ ఐడీ సీరియల్ నెంబర్(సివిల్ ఐడీ కార్డు వెనుక వైపు ఉంటుంది), పాస్‌పోర్టు నెంబర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వృత్తి తదితర సమాచారం అవసరం అవుతుందని ఎంబసీ వివరించింది. ఈ విషయంలో భారత ప్రవాసులకు సహాయం చేసేందుకు రాయబార కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ఎంబసీ అధికారులు వెల్లడించారు. నేరుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. మహమ్మారి నుంచి రక్షణకు టీకా చాలా ముఖ్యమని ఈ సందర్భంగా రాయబార కార్యాలయం పేర్కొంది. 

Updated Date - 2021-03-18T13:44:21+05:30 IST