‘సీక్రెట్‌’ ఈమెయిల్స్‌

ABN , First Publish Date - 2022-01-15T05:30:00+05:30 IST

మెసేజ్‌ నుంచి అటాచ్‌మెంట్స్‌ వరకు ఏదైనా సరే, జీమెయిల్‌ నుంచి పంపుకోవడం తెలిసిందే. సమస్తం రెడీ చేసుకుంటే చాలు, క్షణాల్లో సమాచారాన్ని పంచుకుంటారు. అయితే మెయిల్స్‌లో సీక్రెట్‌ మోడ్‌ కూడా ఉంటుంది. చాలామంది ఇదేదో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సంబంధించిన..

‘సీక్రెట్‌’ ఈమెయిల్స్‌

మెసేజ్‌ నుంచి అటాచ్‌మెంట్స్‌ వరకు ఏదైనా సరే,  జీమెయిల్‌ నుంచి పంపుకోవడం తెలిసిందే. సమస్తం రెడీ చేసుకుంటే చాలు, క్షణాల్లో సమాచారాన్ని పంచుకుంటారు. అయితే మెయిల్స్‌లో సీక్రెట్‌ మోడ్‌ కూడా ఉంటుంది. చాలామంది ఇదేదో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సంబంధించిన వ్యవహారమో లేదా బ్యాంకుల వంటి ఆర్థిక వ్యవహారాలు చూసే సంస్థలకు సంబంధించిన విషయమో అనుకుంటుంటారు. అయితే సామాన్యులు కూడా దీన్ని సొంత అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. 


సాధారణ యూజర్లు కూడా సీక్రెట్‌ సమాచారాన్ని లేదంటే ఫైల్స్‌ను నిర్దేశిత వ్యక్తులు మినహా మరెవ్వరికీ అందుబాటులో లేని పద్ధతిలో పంపుకొనే వెసులుబాటు కూడా జీమెయిల్‌లో ఉంది. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌, ఐపాడ్‌, కంప్యూటర్‌ నుంచి కూడా ఈవిధంగా పంపుకోవచ్చు. అలాగే వాటికి ఎక్స్‌పైరీ డేట్‌ పెట్టుకోవచ్చు. పంపిన మెయిల్‌ను తిరిగి వెనక్కి  తెచ్చుకునే సౌలభ్యం ఇందులో ఉంది. వాటిని రిసీవ్‌ చేసుకునే వ్యక్తులు అవసరం అనుకుంటే కాపీ చేసుకోవచ్చు. మరొకరికి పంపుకోవచ్చు. స్ర్కీన్‌షాట్స్‌ తీసుకుని కూడా వారు పంపుకోగలుగుతారు. అదేవిధంగా సెండర్‌ దగ్గర డివైస్‌ లేదంటే కంప్యూటర్‌లో మాల్వేర్‌ ఉంటే ఎవరైనా తస్కరించనూ వచ్చు. అలాంటి వేటినీ నిరోధించలేం. 


కంప్యూటర్‌ ద్వారా పంపుకొనే విధం

కంప్యూటర్‌ ద్వారా సీక్రెట్‌ మెయిల్స్‌, అటాచ్‌మెంట్స్‌ పంపుకోవాలంటే కింది విధంగా చేయాల్సి ఉంటుంది. స్కూల్‌ లేదంటే పనిచేస్తున్న చోట నుంచి సీక్రెట్‌ ఈమెయిల్‌ పంపుకోవాలంటే సంబంధితుల నుంచి మొదట పర్మిషన్‌ తీసుకోవాలి. 

ఆ కంప్యూటర్‌లోని జీమెయిల్‌ అకౌంట్‌లోకి వెళ్ళి మొదట కంపోజ్‌పై క్లిక్‌ చేయాలి. 

విండో దిగువన కుడిపక్క కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌ టర్న్‌ ఆన్‌ కోసం క్లిక్‌ చేయాలి. 

ఎక్స్‌పైరీ డేట్‌, పాస్‌కోడ్‌ సెట్‌ చేయాలి. మెసేజ్‌లకు, అటాచ్‌మెంట్స్‌కు ఈ సెట్‌ కోడ్‌ వర్తిస్తుంది. ‘నో ఎస్‌ఎంఎస్‌ కోడ్‌’ని ఎంపిక చేసుకున్న పక్షంలో జీమెయిల్‌ యాప్‌ ఉన్న అందుకునే వారు దాన్ని నేరుగా ఓపెన్‌ చేసుకోవచ్చు. రిసీవ్‌ చేసుకోవాల్సిన వ్యక్తి జీమెయిల్‌ ఉపయోగించనట్లయితే పాస్‌కోడ్‌ ఈమెయిల్‌ చేస్తారు. ‘ఎస్‌ఎంఎస్‌ కోడ్‌’ని సెలెక్ట్‌ చేసుకుంటే రిసీవర్లు టెక్స్ట్‌ మెసేజ్‌ రూపంలో పాస్‌వర్డ్‌ను అందుకుంటారు. అందుకోవాల్సిన వ్యక్తి ఫోన్‌ నంబర్ని ఇక్కడ ఇవ్వాలి. అంతేతప్ప పంపే వ్యక్తి ఫోన్‌ నంబర్‌ ఇవ్వకూడదు. 

చివరగా సేవ్‌పై క్లిక్‌ చేయాలి. 

ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, టాబ్లెట్‌, ఐపాడ్‌లో

జీమెయిల్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి

కంపోజ్‌ని టాప్‌ చేయాలి

కుడివైపు టాప్‌లో ‘మోర్‌ మోర్‌’ని టాప్‌ చేయాలి. తదుపరి కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌కి వెళ్ళాలి. 

కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌ని టర్న్‌ఆన్‌ చేయాలి. 

ఎక్స్‌పైరీ తేదీ, పాస్‌కోడ్‌, ఇతర కంట్రోల్స్‌ను సెట్‌ చేయాలి. ‘నో ఎస్‌ఎంఎస్‌’ కోడ్‌ని ఎంచుకుంటే, జీమెయిల్‌ యాప్‌ ఉన్న రిసీవర్లకు ఆటోమేటిక్‌గా అది ఓపెన్‌ అవుతుంది. అది ఉపయోగించని వ్యక్తులకు పాస్‌కోడ్‌  ఈమెయిల్‌ అవుతుంది. ‘ఎస్‌ఎంఎస్‌ పాస్‌కోడ్‌’ని ఎంచుకుంటే రిసీవర్లకు టెక్ట్స్‌ మెసేజ్‌ రూపంలో పాస్‌కోడ్‌ వెళుతుంది. పంపుతున్న వారిది కాకుండా, అందుకోవాల్సిన వ్యక్తి ఫోన్‌ నంబర్‌ని మెన్షన్‌ చేయాలి. 

చివరకు టాప్‌ చేయాలి.


యాక్సెస్‌ను ముందుగానే తొలగించాలంటే

ఎక్స్‌పైరీ డేట్‌ కంటే ముందే యాక్సెస్‌ను తొలగించవచ్చు. అదెలాగంటే...

కంప్యూటర్‌, టాబ్లెట్‌, ఆండ్రాయిడ్‌, ఐపాడ్‌ తదితరాల్లో జీమెయిల్‌ ఓపెన్‌ చేయాలి. 

ఎడమపక్క సెంట్‌ ఆన్‌ కంప్యూటర్‌పై క్లిక్‌ చేయాలి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌, టాబ్లెట్‌, ఐపాడ్‌, ఐఫోన్‌లో మెనూ తదుపరి సెంట్‌ టాప్‌ చేయాలి.


కాన్ఫిడెన్షియల్‌ ఈమెయిల్‌ని ఓపెన్‌ చేయాలి. 

రిమూవ్‌ యాక్సెస్‌పై క్లిక్‌ చేయాలి. 

కాన్ఫిడెన్షినల్‌ మోడ్‌తో వచ్చిన ఈమెయిల్‌ని ఓపెన్‌ చేయాలంటే...

ఎక్స్‌పైరీ డేట్‌ లోపు, యాక్సెస్‌ని ముందుగానే రిమూవ్‌ చేయకుంటే వచ్చిన మెసేజ్‌ను చూడగలుగుతారు. 

పాస్‌కోడ్‌ ఎంటర్‌ చేసి మెసెజ్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2022-01-15T05:30:00+05:30 IST