ఆకట్టుకున్న శకటాల ప్రదర్శనలు

ABN , First Publish Date - 2021-01-27T05:41:22+05:30 IST

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 72వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలు, సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించి అలంకృత శకటాల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకు న్నాయి.

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శనలు
వైఎస్‌ఆర్‌ ప్రైమరీ స్కూల్‌ శకటం

ఏలూరు టూటౌన్‌, జనవరి 26 : పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 72వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలు, సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించి అలంకృత శకటాల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకు న్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మత్స్యశాఖలో అమల వుతున్న పథకాలను వివరిస్తున్న శకటం ఆకర్షించింది. గ్రామ, వార్డు సచివాల యాల ద్వారా అందిస్తున్న సేవలను జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ప్రదర్శించింది. పశుసంవర్ధకశాఖ  శకటం, వైఎస్‌ఆర్‌ జలకళ, పోలవరం ప్రాజెక్టు గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు ప్రదర్శించే శకటం, వైఎస్‌ఆర్‌ ప్రీ ప్రైమరీ స్కూల్‌ శకటాలు ఆకట్టుకున్నాయి. కొవిడ్‌–19 వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సినేషన్‌ ఇచ్చే కార్యక్రమం, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, 108, 104 అంబులెన్సులు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ చిన్నారులు, గర్భిణులు బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పించే శకటం, విద్యా శాఖ ద్వారా అమ్మఒడి నాడు–నేడు శకటాలు, అత్యవసర సమయంలో సేవలందించే విపత్తుల నివారణ, అగ్ని మాపక సేవలపై అగ్ని మాపక శాఖ ఏర్పాటు చేసిన శకటాలు అందరినీ ఆకర్షించాయి. 





Updated Date - 2021-01-27T05:41:22+05:30 IST