Abn logo
Sep 24 2020 @ 11:48AM

సైకిల్‌పై కొత్త సవారీ..!

Kaakateeya

ఏలూరు, నరసాపురం కేంద్రాలుగా కమిటీలు

తొలుత అధ్యక్షుడి ప్రకటన.. ఆ తదుపరి కార్యవర్గం

ఇప్పటికే పూర్తయిన కసరత్తు

నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన


(ఏలూరు-ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే పార్లమెంట్‌ స్థానాలను కేంద్రంగా చేసుకుని వాటినే జిల్లాలుగా పరిగణిస్తూ కమిటీలను నియమించాయి. గడిచిన రెండు నెలలుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కమిటీల కూర్పుపై సుదీర్ఘ కసరత్తు చేశారు. సంస్థాగతంగా మరింత బలపడేందుకు పదునైన వ్యూహం రూపొందిస్తూ.. సామాజిక బలాబలాలు, ఆర్థిక హంగులు కలిగిన నేతలతోపాటు పార్టీకి నిర్విరామ సేవలు చేస్తున్న వారిని గుర్తించి పార్టీ పగ్గాలు ఇవ్వా లని నిర్ణయించారు. గత నెల మొదటి వారంలోనే ఈ కమిటీలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలన్నీ ఎదురు చూశాయి. ఓ వైపు కరోనా, ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఆందోళనలు జరుగు తున్న నేపథ్యంలో కమిటీల కూర్పులో జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెలలోనే కమిటీలకు సారఽథ్యం వహించే అధ్యక్ష స్థానాలను ప్రకటించడానికి సిద్ధపడుతున్నారు. దీంతో టీడీపీ వర్గాల్లో పూర్తి స్థాయి ఉత్కంఠ నెలకొంది.


ఏలూరు పగ్గాలు ఎవరికి...?

ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ కూర్పులో.. ఇప్పటి వరకు పార్టీ కోసం చెమటోడ్చి, అంకితభావంతో నేతలను, అధికార వైసీపీని దీటుగా తమ స్థాయిల్లో ఎదు ర్కోగల్గిన వారిని గుర్తించి పగ్గాలు అప్పజెప్పేందుకు చేస్తు న్న సుదీర్ఘ కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలుగా తోట సీతా రామలక్ష్మి ఉన్నారు. పార్టీకి పలు విడతలుగా సహాయపడటమే కాకుం డా ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయ నిర్వహణను ఆమె భుజానకేసుకున్నారు. పార్టీ శ్రేణులకు అండగా నిలిచి అధి నాయకత్వం వద్ద మంచి పేరే తెచ్చుకున్నారు. తాజాగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించారు.


ఏలూరు జిల్లా కేంద్రంగా పార్టీని ఒంటి చేత్తో నడిపించగల శక్తి సామర్థ్యాలు ఆయన కే ఉన్నాయని పలు వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆయనకు మద్దతుగా అనేక మంది నిలిచినట్టు సమాచారం. క్యాడర్‌ను, నేతలను సమన్వయ పర్చడం, పార్టీ కార్యక్రమాలను విజ యవంతం చేయడం, అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే సామర్ధ్యం కల్గి ఉండటం వంటి పరిణామాలు అన్నింటిలో నూ ఆయన సమర్ధత ప్రదర్శించారు. ఈ కారణంగా ఆయ న పేరును పరిశీలనలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ ఎస్సీల కు పగ్గాలు అప్పగించాలనుకుంటే మాజీ మంత్రి పీతల సుజాతను ఎంపిక చేయ వచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే తన సొంత ఖర్చులను భరిస్తూ పార్టీ కార్యక్రమాల నిర్వహ ణలో పైచేయిగా ఉన్నారు. ఆమెకుతోడుగా ఎస్సీ సెల్‌ అధ్య క్షులు దాసరి ఆంజనేయులు గృహ నిర్బంధాలను చవిచూసి పార్టీ కార్యక్రమాలను ముందుకు నడిపించారు.

 

కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌ పేరు ను పరిశీలనలోకి తీసుకుంటున్నారు. మూడున్నర దశాబ్దా లుగా పార్టీనే నమ్ముకుని అత్యంత విశ్వాస పాత్రుడుగా ఉన్న ఆయనను మొదటి నుంచి పార్టీ గౌరవిస్తూ వచ్చింది. మరోవైపు బీసీ లకు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై తర్జన భర్జన పడ్డారు. ఈ క్రమంలోనే నూజీవీడుకు చెందిన సీని యర్‌ నేత ముజరబోయిన వెంకటేశ్వర్లు, టి.నరసాపురానికి చెందిన శీలం వెంకటేశ్వరరావు పేర్లు చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. పార్టీకి ఒకనాడు వెన్నుదన్నుగా వున్న, ఏలూరు టిక్కెట్టు ఆశించిన బోళ్ల రాజీవ్‌ ఈ మధ్య కాలంలో పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. 


మరో సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబుదీ ఇదే పరిస్థితి. అధ్యక్ష స్ధానంలో గన్నితోపాటు తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పెనుమర్తి రామ్‌కుమార్‌ పేరు ప్రస్తావనకు వచ్చింది. సోషల్‌ మీడియాలోను, వైసీపీకి దీటుగా ఎదుర్కో వడంలోనూ, పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి తాను సుముఖంగానే ఉన్నానని తాజాగా పార్టీ కార్యదర్శి  నారా లోకేశ్‌ను కలిసి స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ తుది జాబితా చంద్రబాబు నిర్ణయం ప్రకారమే వెలువడబోతుంది. 


నరసాపురంలో చోటెవరికి..?

నరసాపురం లోక్‌సభ స్థానంలో అధ్యక్ష స్థానం ఎవరికి ఇవ్వాలనే దానిపై మొదటి నుంచి పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానంలో రెండు అసెంబ్లీ స్థానాలను పార్టీ గెలవడమే కాకుండా అత్యంత చురుకైన పార్టీ నేతలు ఇదే నియోజవర్గంలో ఉన్నారు. ఈ క్రమంలో భాగంగానే పార్టీ జిల్లా అఽధ్యక్షురాలు సీతారామలక్ష్మికి మరోమారు నరసాపురం జిల్లా బాధ్యతలు అప్పగించాలని ప్రాథమి కంగా నిర్ణయించడానికి పార్టీ సిద్ధమైనప్పుడు వయస్సు రీత్యా ఈ బాధ్యతలు మోసేందుకు సీతమ్మ కొంత అయిష్టంగానే ఉన్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు ఒత్తిడి చేస్తే తలొగ్గవచ్చని చెబుతున్నారు. ఈ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ విషయంలో తొలుత పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఇప్పటికే ఆయన అసెంబ్లీలో పార్టీ ఉపనేతగా వ్యవహరిస్తున్నారు. వివిధ కార్యక్రమాల అమలు, వ్యూహంలో ముందు వరుసలో ఉన్నారు. తిరుగులేని నాయకత్వ సమర్థత ఆయనకు ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మరికొందరి పేర్లు పార్టీ పరిశీలనలోకి తీసుకుంది.


సుదీర్ఘ కాలంగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్‌ నేత మెంటే పార్ధసారథి, వీరవాసరానికి చెందిన చంద్ర శేఖర్‌, తాడేపల్లిగూడెంకు చెందిన గొర్రెల శ్రీధర్‌, పాలకొల్లుకు చెందిన ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, భీమవరానికి చెందిన కోళ్ల నాగేశ్వరరావు పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో బీసీ, కాపు సామాజిక వర్గాల నుంచి సమతు ల్యంగా ప్రాధాన్యం ఇచ్చేందుకు సంకల్పించారు. ఇప్పటికే ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు పేరు పరిశీలనలోకి వచ్చినా కీలకమైన ఈ బాధ్యతలను చేపట్టేందుకు ఆయన సుముఖంగా లేరని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఈలి నాని, మాజీ జడ్పీ చైర్మన్‌ బాపిరాజు వంటి సీనియర్‌లను సంప్రదించి అధ్యక్ష స్థానా నికి ఎవరిని ప్రతిపాదించాలనే దానిపై రెండు రోజులుగా తర్జన భర్జన చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంటరీకి సంబంధించి బీసీలకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement