Abn logo
Jul 1 2020 @ 07:33AM

కాళ్లపారాణి ఆరకముందే నవవధువు అనుమానాస్పద మృతి

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే ఓ నవవధువు అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో గంధం సుధ (18) అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుధకు జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన బాలుతో గత మే నెలలో వివాహం జరిగింది. ఇంతలో ఏమైందో.. ఏమోగానీ అర్థాంతరంగా తనువుచాలించింది. మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement