జంగారెడ్డిగూడెంలో TDP ‘బాదుడే బాదుడు’

ABN , First Publish Date - 2022-07-19T15:18:08+05:30 IST

జగన్ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించింది.

జంగారెడ్డిగూడెంలో TDP ‘బాదుడే బాదుడు’

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): జగన్(Jagan) ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో టీడీపీ (TDP) బాదుడే బాదుడు (Badude badudu) కార్యక్రమాన్ని నిర్వహించింది. టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు రావూరికృష్ణ  అధ్యక్షతన 12,13,14 వార్డుల్లో బాదుడే బాదుడు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్ర శేషు(Dasari syam chandra) మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వ పాలన తుగ్లక్ పరిపాలనలా ఉందని విమర్శించారు.  పెట్రోల్, డీజీల్ ధరలు, నిత్యావసర ధరలు అధికంగా పెంచి ప్రజలపై అధిక భారం మోపారన్నారు.


రావూరికృష్ణ మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వం అవలంభించే తీరు ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కి నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, పరిమి సత్తిపండు, ఆకుమర్తి రామారావు, గుళ్ళపూడి శ్రీదేవి, పెనుమర్తి రామ్ కుమార్, కోటగిరి ప్రమీల, చెరుకూరి శ్రీధర్, చిట్రొజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, మందపల్లి లక్ష్మయ్య, కోనేటి చంటి, గెడా సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజి, ఎన్ని రాంబాబు, చేను ప్రసాద్, కొమ్మిరెడ్డి సోమరాజు, షేక్ నజీర్, కరణం రాంబాబు, పూతి శేఖర్, షెక్ యాకుబ్, మల్లిపూడి నవీన్, ఏడుకొండలు, ఈర్ని సూరిబాబు, ఐటిడిపి సాయికృష్ణ, కాసాని ప్రసాద్, బాబీ, నానీ, క్రుపవరం, వెంపల రాజు,  12,13,14 వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-19T15:18:08+05:30 IST