ఇతర ప్రాంతాల వారు బద్వేలులో ఉండరాదు

ABN , First Publish Date - 2021-10-28T05:42:38+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించి బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రచార గడువు ముగుస్తుందని ఎన్నికకు 72 గంటల ముందు ఓటరు కాని వారు (స్థానికేతరులు) ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఉండకూడదని, ఇతర ప్రాంతాలకు చెందిన వారు వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఎస్పీ కేకేఎన అన్బురాజన సూచించారు.

ఇతర ప్రాంతాల వారు బద్వేలులో ఉండరాదు

ముగిసిన ప్రచార సమయం

సమస్యలుంటే 9121100653 నెంబర్‌కు ఫోన చేయండి

ఎస్పీ కేకేఎన అన్బురాజన

కడప(క్రైం), అక్టోబరు 27: బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించి బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రచార గడువు ముగుస్తుందని ఎన్నికకు 72 గంటల ముందు ఓటరు కాని వారు (స్థానికేతరులు) ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఉండకూడదని, ఇతర ప్రాంతాలకు చెందిన వారు వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఎస్పీ కేకేఎన అన్బురాజన సూచించారు. లాడ్జీ, హోటళ్లు, కళ్యాణ మండపాలు, రెస్ట్‌ హౌస్‌లను ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అద్దెకిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్లను తరలించేందుకు వాహనాలు వాడకూడదని, దీనిని ఉల్లంఘిస్తే ఆయా వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఫంక్షనహాళ్లు, లాడ్జీలు, గృహ సముదాయాలను రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించేందుకు, సామూహిక భోజనాల ఏర్పాటు కోసం, వసతికి, వ్యక్తుల సమీకరణ కోసం వినియోగించరాదన్నారు. 30న జరగనున్న బద్వేలు ఉప ఎన్నిక కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యలను సృష్టించేవారిని గుర్తించి కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో పాటు బైండోవర్‌ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడైనా ఆటంకం కలిగించినా, గొడవలకు, ఘర్షణలకు దిగినా రౌడీషీట్‌ తెరుస్తామని ఎస్పీ హెచ్చరించారు. పోలింగ్‌, కౌంటింగ్‌ రోజున జరిగే ఘటనలు, ఎన్నికల అక్రమాలకు సంబంధించి డయల్‌ 100 లేదా జిల్లా పోలీస్‌ ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 91211 00653కు సమాచారమివ్వాలని ఎస్పీ సూచించారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు.


అభ్యర్థులకు ఎస్పీ సూచనలు

- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి

- మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేయకూడదు

- గొడవ, హింస, అల్లర్లు, వాగ్వాదాలకు దిగకూడదు. వదంతులను ప్రచారం చేయకూడదు

- సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి రెచ ్చగొట్టే పోస్టులు పోస్టు చేయకూడదు

- ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులెదురైనా తక్షణమే పోలీసుశాఖ దృష్టికి తీసుకురావాలి

- పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు.

Updated Date - 2021-10-28T05:42:38+05:30 IST