పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు

ABN , First Publish Date - 2022-08-15T05:49:38+05:30 IST

చౌడేపల్లె మండలంలోని పందిళ్లపల్లె పంచాయతీ చుక్కావారిపల్లెలో గత 2 రోజులగా పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. శనివారం రాత్రి చుక్కావారిపల్లెలోని ఎంపీపీ హైస్కూల్‌ ప్రహరీని ధ్వంసం చేశాయి.

పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు
డ్రిప్‌ పరికరాలును ధ్వంసం చేసన ఏనుగులు

పట్టించుకోని అటవీశాఖ అధికారులు


భయభ్రాంతుల్లో ప్రజలు


చౌడేపల్లె, ఆగస్టు 14: మండలంలోని పందిళ్లపల్లె పంచాయతీ చుక్కావారిపల్లెలో గత 2 రోజులగా పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. శనివారం రాత్రి చుక్కావారిపల్లెలోని ఎంపీపీ హైస్కూల్‌ ప్రహరీని ధ్వంసం చేశాయి. అలాగే రైతు నారాయణరాజుకు చెందిన టామోటా, వరి పంటను, డ్రిప్‌ పైపులను, రైతు కుమార్‌రాజా చెరుకు క్రషర్‌ను, రైతు అశోక్‌రాజు బీన్స్‌, బీర పంటలను, శ్రీధర్‌రాజు కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి. రాత్రయితే గ్రామంలోకి వస్తుండటంతో తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. 9 ఏనుల మంద పొలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తుయని ఆవేవన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదన్నారు.  



Updated Date - 2022-08-15T05:49:38+05:30 IST