ఇంటి నుంచి పారిపోయిన ఇల్లాలు.. భర్త అడిగాడని బిడ్డను తిరిగిస్తానంటూ పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ..

ABN , First Publish Date - 2022-04-12T08:34:37+05:30 IST

పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కన్న తర్వాత ఇంట్లో నుంచి పారిపోయిందామె. వెళ్లేటప్పుడు రెండో కుమారుడిని తనతో తీసుకెళ్లిపోయింది. సడెన్‌గా ఇంటి ఇల్లాలు కనిపించకపోవడంతో ఆ కుటుంబం గాభరా పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఆమె ఎక్కడుందో కనుక్కున్న పోలీసులు కుటుంబ సభ్యులను...

ఇంటి నుంచి పారిపోయిన ఇల్లాలు.. భర్త అడిగాడని బిడ్డను తిరిగిస్తానంటూ పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ..

పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కన్న తర్వాత ఇంట్లో నుంచి పారిపోయిందామె. వెళ్లేటప్పుడు రెండో కుమారుడిని తనతో తీసుకెళ్లిపోయింది. సడెన్‌గా ఇంటి ఇల్లాలు కనిపించకపోవడంతో ఆ కుటుంబం గాభరా పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఆమె ఎక్కడుందో కనుక్కున్న పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిచి అసలు విషయం చెప్పారు. పోలీసులు వద్దే ఉన్న సదరు మహిళ.. తను ఇష్టపూర్వకంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరే వ్యక్తిని పెళ్లాడినట్లు చెప్పడంతో ఆ కుటుంబం షాకైపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురిలో వెలుగు చూసింది. 


సదరు మహిళ మొదటి భర్తతో ఇద్దరు పిల్లలను కన్నది. ఆ తర్వాత మొబైల్‌లో పానిపట్‌కు చెందిన గుడ్డూ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా తన రెండో బిడ్డను తీసుకొని ఆమె ఇంటి నుంచి పరారైంది. 


పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తేలడంతో ఆ కుటుంబం ఏమీ చేయలేకపోయింది. ఆమె పానిపట్‌లో తన రెండో భర్తతో కాపురం పెట్టింది. అయితే తన బిడ్డను తనకు ఇచ్చేయాలని మొదటి భర్త ఒత్తిడి చేయడంతో మళ్లీ శివపురి పోలీస్ స్టేషన్‌కు వచ్చిందామె. బిడ్డను పోలీసుల సమక్షంలో మొదటి భర్తకు ఇచ్చేసి వెళ్లిపోతానని చెప్పింది. అయితే ఈ విషయంలో పిల్లవాడి వయసును దృష్టిలో ఉంచుకొని కోర్టు నిర్ణయం తీసుకుంటుందని పోలీసులు అంటున్నారు. 


Updated Date - 2022-04-12T08:34:37+05:30 IST