అమెరికా చరిత్రలో ఎవ్వరూ కట్టనంత ట్యాక్స్ కడతా... ఎలాన్ మస్క్ ఛాలెంజ్.. ఆ తరువాత..

ABN , First Publish Date - 2021-12-20T23:46:44+05:30 IST

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది తాను 11 బిలియన్ డాలర్ల పన్ను చెల్లిస్తానంటూ ట్విటర్ ద్వారా ప్రకటించారు.

అమెరికా చరిత్రలో ఎవ్వరూ కట్టనంత ట్యాక్స్ కడతా... ఎలాన్ మస్క్ ఛాలెంజ్.. ఆ తరువాత..

ఇంటర్నెట్ డెస్క్: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది తాను 11 బిలియన్ డాలర్ల పన్ను చెల్లిస్తానంటూ ట్విటర్ ద్వారా ప్రకటించారు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే.. ఈ మొత్తం దాదాపు 83 వేల కోట్ల రూపాయలకు సమానం. అమెరికా చరిత్రలో మరెవ్వరూ కట్టనంత ట్యాక్స్ కడతానంటూ ఇటీవల భీషణ ప్రతిజ్ఞ చేసిన మస్క్.. ఆదివారం తాను చెల్లించబోయే పన్ను గురించి చెప్పుకొచ్చారు. 


అసలు ఈ ప్రతిజ్ఞాపర్వానికి మూలం కొన్ని రోజుల క్రితం ప్రచురితమైన టైమ్ మ్యాగజైన్ సంచిక. ఆ సంచికలో టైమ్స్ మ్యాగజైన్ ఎలాన్ మస్క్‌ను.. ‘ఈ ఏడాది మేటి వ్యక్తి’ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆ తరువాతే కథ మరో మలుపు తిరిగింది. టైమ్స్ మ్యాగజైన్ కథనంపై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఎలిజబెత్ వారెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ‘ఈ ఏటి మేటి వ్యక్తి’ 2018లో ఒక్క డాలర్ పన్ను కూడా చెల్లించలేదు. ప్రజలపై పడి బతికేస్తున్న ఇలాంటి వ్యక్తులకు బ్రేకులు వేసేలా పన్ను చట్టాలను సవరించాలి’ అంటూ నిప్పులు చెరిగారు. అయితే ఎలిజబెత్ వారెన్ కామెంట్స్‌పై ఎలాన్ మస్క్‌ కూడా అదే స్థాయిలో స్పందించారు. ‘అమెరికా చరిత్రలో ఎవ్వరూ కట్టనంత ట్యాక్స్ కడతా’ అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే మస్క్ తాజాగా తాను చెల్లించబోయే ట్యాక్స్‌కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ అన్న విషయం తెలిసిందే. మార్కెట్ అంచనాల ప్రకారం.. మస్క్ సంపద విలువ 297 బిలియన్ డాలర్లు!







Updated Date - 2021-12-20T23:46:44+05:30 IST