Elon musk తనకు మిగిలిన ఆ ఇంటినీ అమ్మకానికి పెట్టి.. ఇప్పుడేమో..

ABN , First Publish Date - 2021-10-14T01:51:15+05:30 IST

తనకు మిగిలిన ఒకే ఒక సొంతింటిని కూడా అమ్మకాన్ని పెట్టిన టెస్లా అధినేత ఈలాస్ మాస్క్ తాజాగా ఆ భవంతిని గతంతో పోలిస్తే 15 శాతం తక్కువ ధరకే అమ్ముతున్నట్టు ప్రకటించారు.

Elon musk తనకు మిగిలిన ఆ ఇంటినీ అమ్మకానికి పెట్టి.. ఇప్పుడేమో..

ఇంటర్నెట్ డెస్క్: తనకు మిగిలిన ఒకే ఒక సొంతింటిని కూడా అమ్మకానికి పెట్టిన టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఈలాస్ మస్క్ తాజాగా ఆ భవంతిని గతంతో పోలిస్తే 15 శాతం తక్కువ ధరకే అమ్ముతున్నట్టు ప్రకటించారు. అపరకుబేరుడు ఈలాన్ మస్క్ అమితంగా ఆస్తులు పొగేసుకుంటున్నాడంటూ తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఈలాన్ మస్క్ గతేడాది తన ఆస్తుల్లో అధిక భాగాన్ని అమ్మేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పలు భవంతులను విక్రయించారు. 


ఈ ఏడాది జూన్‌లో ఆయన తన చివరి సొంత ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారు. ఆ తరువాత కొన్ని కారణాల రీత్యా ఇంటి అమ్మకాన్ని వాయిదా వేసుకున్న మస్క్.. తాజాగా మరోసారి ఆ ఇంటిని విక్రయానికి పెట్టినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా.. గతంతో పోలిస్తే 15 శాతం తక్కువ దరకే అమ్ముతున్నట్టు పేర్కొన్నారు.  కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న ఈ భవంతిలో ఏడు బెడ్‌రూంలు, పది బాత్రూమ్‌లు ఉన్నాయి. 47 ఏకరాల సువిశాల ఎస్టేట్‌లో ఈ భవంతి ఉంది. ప్రస్తుతం దీని అమ్మకం ధర 32 మిలియన్ డాలర్లు.


అయితే.. డిస్కౌంట్ ప్రకటించాక కూడా మస్క్ ఇంటి ధర అక్కడి ఇతర ఆస్తులతో పోలిస్తే రెండు రెట్లు ఉంటుందని స్థానిక రియాల్టర్‌లు చెబుతున్నారు. కాగా.. ఈలాన్ మస్క్ తన టెస్లా ప్రధాన కార్యాలయాన్ని కూడా కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ రాష్ట్రానికి మార్చిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్న కారణంగా తన సంస్థ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, సుదూర ప్రాంతాల నుంచి తమ కార్యాలయానికి వస్తూ విలువైన సమయాన్ని ప్రయాణాల్లోనే కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-10-14T01:51:15+05:30 IST