లైంగిక వేధింపుల కేసు సెటిల్మెంట్... $ 250 లక్షలతో elone musk సెటిల్మెంట్

ABN , First Publish Date - 2022-05-20T23:10:32+05:30 IST

టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలోన్ మస్క్... పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ అత్యంత ధనవంతుల్లో ఒకడు. SpaceXతో ఇటీవలి కాలంలో మరింతగా చర్చల్లో నిలిచిన అపరకుబేరుడు.

లైంగిక వేధింపుల కేసు సెటిల్మెంట్...  $ 250 లక్షలతో elone musk  సెటిల్మెంట్

* నాలుగేళ్ళ క్రితం నాటి కేసు పరిష్కారం 

లండన్ : టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్... పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ అత్యంత ధనవంతుల్లో ఒకడు. SpaceXతో ఇటీవలి కాలంలో మరింతగా చర్చల్లో నిలిచిన అపరకుబేరుడు. తాజాగా ట్విట్టర్ టేకోవర్ డీల్ విషయంలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.  ఇక ప్రస్తుతానికొస్తే... 2018 లో తనపై నమోదైన లైంగిక వేధింపుల వ్యాజ్యాన్ని పరిష్కరించుకునేందుకుగాను... SpaceX $ 2.50 లక్షలను SpaceX చెల్లించింది. వివరాలిలా ఉన్నాయి. ఆరేళ్ళ క్రితం... 2016  లో లండన్ వెళ్లే విమానంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన సెటిల్మెంట్ 2018 లో జరిగింది. ఫ్లైట్ అటెండెంట్ స్నేహితుడొకరు ఈ వివరాలను వెల్లడించారు. 


ట్విట్టర్‌  టేకోవర్ డీల్ మధ్యలో ఉన్న మస్క్... 2018 లో తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణను పరిష్కరించుకునే క్రమంలో... $ 2.50 లక్షల((దాదాపు రూ. 1.93 కోట్లు)తో సెటిల్మెంట్ చేసుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఇందులోని వివరాల ప్రకారం...  స్పేస్‌ఎక్స్ మాజీ ఫ్లైట్ అటెండెంట్... మస్క్ ప్రైవేట్ జెట్‌లో లండన్‌  వెళుతున్నప్పుడు లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని ఆరోపించారు. మస్క్... అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించినట్లు నివేదిక పేర్కొంది.


శృంగార మసాజ్‌కు బదులుగా... ఆమెకు డబ్బు ఇవ్వజూపాడని సంబంధిత నివేదిక పేర్కొంది. ఇక నివేదికలోని మరిన్ని వివరాల ప్రకారం... ఈ సంఘటన 2016 లో జరిగింది. ఫ్లైట్ అటెండెంట్ స్నేహితుడు సంతకం చేసిన డిక్లరేషన్‌లో ఈ  వివరాలున్నాయి.  తన వాదనకు మద్దతు కూడా ఉన్నట్లు ఆమె చెబుతోంది. కాగా... 2018 లో ఫ్లైట్ అటెండెంట్ కాలిఫోర్నియాకు చెందిన లాయర్‌ను  నియమించుకోవడంతోపాటు సదరు ఎపిసోడ్‌ను వివరిస్తూ కంపెనీ హెచ్‌ఆర్ విభాగానికి ఫిర్యాదును పంపింది. ఆ తర్వాత... కేసు కోర్టుకు చేరుకుంది. ఆ తర్వాత ఈ వివాదం పరిష్కారానికిగాను $ 2.50 లక్షలతో సెటిల్మెంట్ చేసుకునే ఒప్పందానికి అంగీకరించారు. కాగా... ఈ డబ్బు చెల్లింపు వివరాలు మాత్రం వెల్లడి కాలేదని వినవస్తోంది. 

Updated Date - 2022-05-20T23:10:32+05:30 IST