19ఏళ్ల కుర్రాడికి రూ.3.75లక్షలు ఆఫర్ చేసిన Elon Musk.. తనకు రూ.37లక్షలు కావాలని యువకుడి డిమాండ్..

ABN , First Publish Date - 2022-01-30T01:53:28+05:30 IST

ఆ యువకుడికి 19ఏళ్లే. కానీ అతడు చేసిన ఓ పనికి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్కే స్వయంగా... ఆ కుర్రాడ్ని సంప్రదించాడు. ఏకంగా 5వేల డాలర్లు (సుమారు రూ.3.75లక్షలు) ఆఫర్ చేశాడు. అయితే ఆ కుర్రాడు మాత్రం ఎలన్ మస్క్ ఆఫర్‌ను తిరస్కరించాడు. 50వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

19ఏళ్ల కుర్రాడికి రూ.3.75లక్షలు ఆఫర్ చేసిన Elon Musk.. తనకు రూ.37లక్షలు కావాలని యువకుడి డిమాండ్..

ఎన్నారై డెస్క్: ఆ యువకుడికి 19ఏళ్లే. కానీ అతడు చేసిన ఓ పనికి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్కే స్వయంగా... ఆ కుర్రాడ్ని సంప్రదించాడు. ఏకంగా 5వేల డాలర్లు (సుమారు రూ.3.75లక్షలు) ఆఫర్ చేశాడు. అయితే ఆ కుర్రాడు మాత్రం ఎలన్ మస్క్ ఆఫర్‌ను తిరస్కరించాడు. 50వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చేసేదేమీలేక మస్క్.. ఆ మొత్తాన్ని తనకు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. కాగా.. ఎలన్ మస్క్ ఏంటి.. 19ఏళ్ల కుర్రాడి ప్రతిపాదనకు ఓకే చెప్పడం ఏంటి? మస్క్ అంత పెద్ద మొత్తం కుర్రాడికి ఎందుకివ్వాలి? ఇంతకూ ఆ యువకుడు చేసిన ఘనకార్యం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


జాక్ స్వీనీ అనే 19ఏళ్ల కాలేజీ కుర్రాడు Elon musks's jet అనే పేరుతో కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ ఖాతాను ప్రారంభించాడు. తర్వాత ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా మస్క్ ప్రైవేట్ జెట్‌‌ను ట్రాక్ చేయడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా మస్క్ ప్రైవేట్ జెట్ ఎక్కడ టేకాఫ్ అయింది.. ఎక్కడ ల్యాండ్ అయిందనే వివరాలను తాను ప్రారంభించిన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ వచ్చాడు. అదికాస్తా మస్క్ దృష్టికి వెళ్లడంతో.. స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా జాక్ స్వీనీని సంప్రదించాడట. భద్రతా కారణాల వల్ల తన ప్రైవేట్‌ జెట్‌ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు 5వేల డాలర్లు ఇస్తానని చెప్పాడట.



అయితే జాక్ స్వీనీ మాత్రం మస్క్ ఆఫర్‌ను తిరస్కరించాడట. ఫ్లైట్‌ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు 50 వేల డాలర్లు (సుమారు రూ.37.55లక్షలు) ఇవ్వాలని డిమాండ్ చేశాడట. అయితే అంత మొత్తాన్ని ఇచ్చేందుకు ఒప్పుకున్న మస్క్.. ఇప్పటికీ ఆ డబ్బును స్వీనికి ఇవ్వలేదట. మస్క్-జాక్ స్వీనీ మధ్య కొద్ది రోజుల కిందట జరిగిన ఈ సంభాషణ తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియా ద్వారా బయటపడింది. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. మస్క్ ఇస్తానన్న డబ్బును జాక్ స్వీనీ తన కాలేజీ ఖర్చులకు, టెస్లా కారు కొనుగోలు చేయడానికి కేటాయించాలని భావించాడట.


ఇదిలా ఉంటే.. జాక్ స్వీనీ కేవలం మస్క్ ప్రైవేట్ జెన్‌ను మాత్రమే ట్రాక్ చేయడం లేదట. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి మరో 12 మంది ప్రముఖుల విమానాలను కూడా ట్రాక్ చేస్తూ వాటికి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలలో ఆ వివరాలను పోస్ట్ చేస్తున్నాడట. అయితే మస్క్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో‌‌ Elon musks's jet ట్విట్టర్ ఖాతాకే ఫాలోవర్లు పోటేత్తారట. ఈ ట్విట్టర్ ఖాతాను 83వేల మంది ఫాలో చేస్తున్నట్టు సమాచారం.




Updated Date - 2022-01-30T01:53:28+05:30 IST