Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Sep 2022 15:50:26 IST

Top 10 Richest People in the World in 2022 : ఎలోన్ మస్క్, గౌతమ్ అదానీ ..మిగతావారి పూర్తి జాబితా ఇదిగో.. వీరే టాప్.

twitter-iconwatsapp-iconfb-icon
Top 10 Richest People in the World in 2022 : ఎలోన్ మస్క్, గౌతమ్ అదానీ ..మిగతావారి పూర్తి జాబితా ఇదిగో.. వీరే టాప్.

సంపదను పోగుచేయడం అందరి చేతుల్లోనూ లేని పని. దానికి స్థాయిలు బట్టీ వీరు గొప్ప, మీరు బీదా అనే కేటగిరీలు గీసుకుంటూ బ్రతికేస్తున్నాం. మనలో చాలా మంది ఓమెస్తురు వాళ్ళే.. ఎంత సంపద ఉన్నా మరీ టాప్ టెన్ లో నిలిచే స్థాయిలో అయితే లేం. అయితే అత్యంత సంపన్నులందరినీ ఓ లిస్ట్ వేసుకుంటూ వస్తే ఇదిగో ఈ నెలకు వీరే టాప్ 10 గా నిలిచారట..


ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, గ్లోబల్ ఎకానమీ రూపొందించడంలో బిలియనీర్లు పెద్ద పాత్రనే పోషిస్తున్నారు. 2022లో ప్రపంచంలోని బిలియనీర్ల సంఖ్యను 2,668గా ఉన్నట్లు ఫోర్భ్స్ చెప్పుకొచ్చింది. ఆ బిలియనీర్లలో చాలా మంది టెక్నాలజీ దిగ్గజాల ఫౌండర్స్ వారి సంపాదనను ఎక్కువ భాగం వాళ్ళు మొదలు పెట్టిన కంపెనీల్లోనే పెట్టుబడిగా పెట్టారు. 


ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ర్యాంకింగ్స్: 

గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 10 సంపన్నులలో 3వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రతి నెలా వారి మొత్తం నికర విలువ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల పేర్లను అప్‌డేట్ చేస్తుంది. ఈ జాబితా తాత్కాలికమైనది మాత్రమే.  ప్రజల దగ్గర ఉన్న ఆస్తుల నికర విలువను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ప్రతి నెలలాగే, సెప్టెంబర్ 2022కి సంబంధించి ప్రపంచంలోని టాప్ 10 వ్యక్తుల జాబితా ఇక్కడ ఉంది.


ఈ జాబితాలో ఎలోన్ మస్క్ 273.5 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ర్యాంకింగ్స్‌లో భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ $155.5 బిలియన్ల నికర విలువతో జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నారు, అయితే షేర్ ధరల పతనంతో వెంటనే మూడవ స్థానానికి పడిపోయారు.


గౌతమ్ అదానీ తన నికర ఆదాయంలో 3.49 శాతం పెరిగిన వెంటనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జాబితాలో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్,  జెఫ్ బెజోస్‌లను అధిగమించగలిగారు. అయితే, దలాల్ స్ట్రీట్‌లో మార్కెట్ క్రాష్ కారణంగా, గౌతమ్ అదానీ త్వరగా రెండవ స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఫోర్బ్స్ టాప్ 10 బిలియనీర్స్ లిస్ట్ 2022లో మూడవ స్థానంలో ఉన్నాడు.


ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల తాజా జాబితా 2022..


ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ర్యాంకింగ్స్ ప్రకారం, వారి మొత్తం నికర విలువతో పాటు ప్రపంచంలోని టాప్ 10 అత్యంత సంపన్నుల తాజా జాబితా ఇది...


1. ఎలాన్ మస్క్ $273.5 బిలియన్.

(22 లక్షల కోట్లు)

2. బెర్నార్డ్ ఆర్నాల్ట్ $154.7 బిలియన్.

(12.5 లక్షల కోట్లు)

3. గౌతమ్ అదానీ $152.2 బిలియన్.

(12. 2 లక్షల కోట్లు)

4. జెఫ్ బెజోస్ $146.9 బిలియన్లు.

(11.9 లక్షల కోట్లు)

5. బిల్ గేట్స్ $104.6 బిలియన్లు.

(8.4  లక్షల కోట్లు)

6. లారీ ఎల్లిసన్ $96.8 బిలియన్.

(7.8 లక్షల కోట్లు)

7. వారెన్ బఫెట్ $95.9 బిలియన్.

(7.7 లక్షల కోట్లు)

8. ముఖేష్ అంబానీ 91.4 బిలియన్ డాలర్లు.

(7.4 లక్షల కోట్లు)

9. లారీ పేజ్ $88.8 బిలియన్.

(7.1 లక్షల కోట్లు)

10. సెర్గీ బ్రిన్ $85.2 బిలియన్.

(6.9 లక్షల కోట్లు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.