ట్విట్టర్‌ ఉనికి కోల్పోతున్నట్లుంది: ఎలన్ మస్క్

ABN , First Publish Date - 2022-04-10T23:49:18+05:30 IST

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ తన ఉనికిని కోల్పోతున్నట్లుందని అభిప్రాయపడ్డాడు ఎలన్ మస్క్. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్‌లో ఎక్కువ షేర్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ట్విట్టర్‌ ఉనికి కోల్పోతున్నట్లుంది: ఎలన్ మస్క్

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ తన ఉనికిని కోల్పోతున్నట్లుందని అభిప్రాయపడ్డాడు ఎలన్ మస్క్. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్‌లో ఎక్కువ షేర్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ట్విట్టర్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ను మరింతమందికి చేరువ చేస్తానని చెప్పాడు. తాజాగా ట్విట్టర్ ఉనికి కోల్పోతున్నట్లుందని ట్వీట్ చేశాడు. అలాగే ట్విట్టర్ బ్లూ యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను తక్కువగా వాడుతున్నారని, వీళ్లు మరింత ఎక్కువగా ట్విట్టర్ వాడేలా చేసేందుకు సలహాలు కావాలని కోరాడు. ‘90 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న స్విఫ్ట్ టేలర్ మూడు నెలలుగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. 114 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న జస్టిన్ బీబర్ ఈ ఏడాది ఒకే ట్వీట్ చేశాడు. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవాళ్లు కూడా అప్పుడప్పుడు మాత్రమే ట్వీట్ చేస్తున్నారు. అందుకే టాప్ యూజర్లు ఎక్కువగా ట్విట్టర్ వాడేలా చర్యలు తీసుకుంటానని ఎలన్ మస్క్ చెప్పాడు. త్వరలో ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ కూడా రాబోతుంది.

Updated Date - 2022-04-10T23:49:18+05:30 IST