చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్

ABN , First Publish Date - 2021-01-08T16:48:15+05:30 IST

పన్నెండు నెలల్లో చరిత్ర సృష్టించాడు. ప్రపంచ కుబేరుడిగా మారాడు. పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించాడు. అతడే టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. ఈ ఏడాది టెస్లా కంపెనీ షేర్ల విలువ 4.8 శాతం పెరడగంతో ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో..

చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్

ఇంటర్నెట్ డెస్క్: పన్నెండు నెలల్లో చరిత్ర సృష్టించాడు. ప్రపంచ కుబేరుడిగా మారాడు. పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించాడు. అతడే టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. ఈ ఏడాది టెస్లా కంపెనీ షేర్ల విలువ 4.8 శాతం పెరడగంతో ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాడు. 2017 అక్టోబర్ నుంచి నెంబర్ వన్ బిలియనీర్‌గా కొనసాగుతున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ నికర ఆస్తుల విలువ 188.5 బిలియన్ డాలర్లు. ఓ ఏడాది క్రితం మస్క్ ఆస్తుల నికర విలువ కేవలం 38 బిలియన్ డాలర్లు. స్పేస్ ఎక్స్ ప్రయోగాలు విఫలం కావడం, టెస్లా బులెట్ ప్రూఫ్ కారు పగిలిపోవడం.. ఇలా అనేక ప్రతికూల పరిస్థితులను మస్క్ ఎదుర్కొన్నాడు. వీటి కారణంగా మస్క్ దివాలా తీసే పరిస్థితికి చేరాడు. కానీ మస్క్ పట్టుదలతో పోరాడాడు.


ఎట్టకేలకు స్పెస్ ఎక్స్ విజయంతో ఇక అతడు వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది. దానితో పాటు టెస్లా కార్ల షేర్లు కూడా విపరీతంగా పెరగడంతో మస్క్ ఆస్తులు గణనీయంగా పెరిగాయి. ఎంతలా అంటే కేవలం 12 నెలల వ్యవధిలోనే ఆయన ఆస్తి ఏకంగా 150 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఒక్క ఏడాదిలో ఈ స్థాయిలో సంపద పెంచుకున్న ఘనత ఇప్పటివరకు ఎవరికీ సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు మస్క్ చేసి చూపించాడు. చరిత్ర సృష్టించాడు.


మస్క్ ప్రపంచ కుబేరడిగా మారడానికి టెస్లానే కారణమిన నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే టెస్లా ఈ ఏడాది వందల రెట్లు లాభాలను గడించిందని, దాని కారణంగానే మస్క్ నెంబర్ వన్ బిలియనీర్‌గా మారాడని వారంటున్నారు. తాజాగా అధికారంలోకి వచ్చిన బైడెన్ ప్రభుత్వం ఇంధన కార్లకంటే ఎలక్ట్రిక్ కార్లకే ప్రాధాన్యం ఇవ్వనుందన్న వార్త ప్రస్తుతం అమెరికాలో వినిపిస్తోంది. దీంతో ప్రజల్లో టెస్లాపై ఆసక్తి పెరిగింది. దీంతో మదుపరులు టెస్లా షేర్లను అధిక ధరలకు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ షేర్ల విలువ భారీగా పెరిగింది.

Updated Date - 2021-01-08T16:48:15+05:30 IST