ఇది కరెక్ట్ కాదు.. జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసుపై ఎలన్ మస్క్

ABN , First Publish Date - 2020-06-03T00:07:31+05:30 IST

ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్.. అమెరికన్ పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై స్పందించాడు.

ఇది కరెక్ట్ కాదు.. జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసుపై ఎలన్ మస్క్

కాలిఫోర్నియా: ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్.. అమెరికన్ పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై స్పందించాడు. ఇప్పటికే ఈ మృతిపట్ల జరుగుతున్న నిరసన జ్వాలలు అగ్రరాజ్యంలో చెలరేగుతున్నాయి. ఈ కేసులో హత్యకు కారణమైన ఒక్కపోలీసుపైనే కేసు పెట్టడాన్ని మస్క్ తప్పుబట్టాడు. అతనితోపాటు అక్కడే ఉన్న మిగతా ముగ్గురు అధికారులపై కూడా కేసు పెట్టాలని సూచించాడు. ‘తోటి ఉద్యోగి తప్పు చేస్తుంటే చూస్తూ కూర్చున్న వాళ్లని వదిలేస్తారా? ఇలా చేయడం ద్వారా ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు’ అని మస్క్ పేర్కొన్నాడు. జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో అతని మెడపై కాలుతో తొక్కిన డెరెక్ చావిన్ అనే అధికారిపై హత్య కేసు నమోదు చేశారు. డెరెక్‌తో పాటు ఉన్న మిగతా అధికారులపై ఎలాంటి కేసూ నమోదు కాలేదు.

Updated Date - 2020-06-03T00:07:31+05:30 IST