ఉక్రెయిన్‌కు ఎలాన్ మస్క్ సాయం

ABN , First Publish Date - 2022-02-28T22:08:39+05:30 IST

ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ముందుకొచ్చాడు. సెల్ టవర్స్, కేబుల్స్‌తో సంబంధం లేకుండా శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటర్నెట్ అందే ఏర్పాటు చేశాడు.

ఉక్రెయిన్‌కు ఎలాన్ మస్క్ సాయం

కీవ్: రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌కు ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల నుంచి సాయం అందుతోంది. తాజాగా ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ముందుకొచ్చాడు. సెల్ టవర్స్, కేబుల్స్‌తో సంబంధం లేకుండా శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటర్నెట్ అందే ఏర్పాటు చేశాడు. స్సేస్ ఎక్స్ ప్రాజెక్ట్ ద్వారా ఎలాన్ మస్క్ రాకెట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టి, వాటి ద్వారా నేరుగా ఇంటర్నెట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో రష్యా ఆధిపత్యం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని సెల్ టవర్లు, కేబుళ్లను రష్యా ధ్వంసం చేయడంతో పౌరులకు ఇంటర్నెట్ సేవలు అందడం లేదు. దీంతో తమకు ఈ విషయంలో సాయం చేయాలని, ఉక్రెయిన్ ఉప ప్రధాని ఫెడొరోవ్, ఎలాన్ మస్క్‌ను ట్వీట్‌లో కోరాడు. దీనికి స్పందించిన మస్క్ పది గంటల్లోనే ఉక్రెయిన్‌కు ఇంటర్నెట్ అందించేందుకు ముందుకొచ్చాడు. స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్‌లోని స్టార్‌లింక్ స్టేషన్స్ యాక్టివేట్ చేసి, ఉక్రెయిన్‌కు నేరుగా ఇంటర్నెట్ అందిస్తున్నాడు. ప్రజలు శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు టెర్మినల్ డిష్ వాడుకుంటే చాలు. ఎక్కడ్నుంచైనా ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు.


యాడ్స్ బ్లాక్ చేసిన గూగుల్

మరోవైపు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా రష్యాపై చర్యలకు దిగింది. తమ ప్లాట్‌ఫామ్స్‌పై రష్యాకు చెందిన మీడియా సంస్థలకు యాడ్స్ బ్లాక్ చేసింది. రష్యన్ టెలివిజన్, రష్యా మీడియాతోపాటు, యూట్యూబ్ పైన కూడా రష్యాలో యాడ్స్ ప్లే కాకుండా నిషేధించింది.

Updated Date - 2022-02-28T22:08:39+05:30 IST