మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 25 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో 2,53,204 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,99,150 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.45 టీఎంసీలుగా ఉంది.