ఇళ్ల పట్టాలు తీసుకున్నట్లు సంతకం చేస్తున్న లబ్ధిదారులు
బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 29 : బుచ్చి నగర పంచాయతీలో బుధవారం 920 మందికి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన వారిలో 720 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. మిగిలిన 200 మంది ఇతర సామాజిక వర్గాలకు చెందినవారికి పంపిణీ చేసినట్టు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం పట్టాల పంపిణీ ఉంటుందని మంగళవారం వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు తెలియజేశారు. స్థానిక డీఎల్‌ఎన్‌ఆర్ హైస్కూలులో ఇళ్ల పట్టాల పంపిణీ జరగ్గా, కార్యక్రమానికి హాజరైన పలువురికి పట్టాలు ఇవ్వలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.