చీకటి జీవోలను రద్దు చేయండి

ABN , First Publish Date - 2022-01-27T05:37:33+05:30 IST

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి చీకటిజీవోలను రద్దు చేయాలని ఏఐటీయూ సీ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.

చీకటి జీవోలను రద్దు చేయండి

టెక్కలి: పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి చీకటిజీవోలను రద్దు చేయాలని  ఏఐటీయూ సీ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. బుధవారం దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షన్ముఖరావు విలేకరులతో మాట్లాడుతూ.. డీఏలను సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే  సమస్య మరింత జఠిమైౖందన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హామీలను గుప్పించి పీకలు కోస్తోందని విమరించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు యడ్ల గోపి, పోలారావు, గోవింద రాజులు, ప్రభుదేవ పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-01-27T05:37:33+05:30 IST