అర్హులకు పదోన్నతులు కల్పించాలి

ABN , First Publish Date - 2020-10-02T08:33:59+05:30 IST

తమలో అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని కోరుతూ జిల్లాలోని పలు మండలాల్లో ..

అర్హులకు పదోన్నతులు కల్పించాలి

 గ్రామ రెవెన్యూ అధికారుల ఆందోళన

తహశీల్దార్లకు వినతిపత్రాలు


ఏలేశ్వరం/కొత్తపల్లి, అక్టోబరు 1: తమలో అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని కోరుతూ జిల్లాలోని పలు మండలాల్లో వీఆర్వోలు గురువారం ఆందోళ నలు నిర్వహించారు. తహశీలార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏలేశ్వరంలో వీఆర్వోల సంఘం జిల్లా జాయింట్‌ సెక్రటరీ అవసరాల కిషోర్‌, మండల కార్యదర్శి బి.మోహనరావుదొర ఆధ్వర్యంలో పట్టణ, 12గ్రామాల పరిధిలోని వీఆర్వోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. బయోమెట్రిక్‌ హాజరు విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని, సచివాలయాల్లో రికార్డుల నిర్వాహణ, రెవెన్యూ సర్వీసుల నిమిత్తం ప్రత్యేక గది, కంప్యూటర్ల సదుపాయం కల్పించాలన్నారు. జీతాల చెల్లింపులు, సర్వీసు సంబంధిత విషయాలన్నీ తహశీల్దార్‌కు అప్పగించాలని కోరారు. అనంతరం ఏలేశ్వరంలో తహశీల్దార్‌ రజనీకుమారీకి, కొత్తపల్లిలో తహశీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంటు సత్యప్రసాద్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కొట్టేటి సత్యారావు, వెం కటరెడ్డి, సూర్యనారాయణ, రొంగల శ్రీనివాస్‌, అవసరాల శ్రీహరి, వీఆర్వోల సంఘ కొత్తపల్లి అధ్యక్షుడు కోన సత్యనారాయణ, కార్యదర్శి పోసపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



గొల్లప్రోలు: గొల్లప్రోలు తహసీల్దారు కార్యాలయం వద్ద ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వీఆర్వో కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించాలని నినాదాలు చేశారు. ఆందోళనలో గొల్లప్రోలు పట్టణం, మండలంలోని వీఆర్వోలు పాల్గొన్నారు.


గోకవరం: గోకవరంలో జరిగిన కార్యక్రమంలో వీఆర్వోలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం నేటికి అమలుకాలేదని, అవి నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ పట్ల ఉన్న తాధికారులు వివక్షత చూపుతున్నారన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్దార్‌ దివ్య భారతికి అందజేశారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘ అధ్యక్షుడు దారా ధర్మరాజు, ఉపాధ్యక్షుడు లంక అప్పారావు, కార్యదర్శి వీరబాబు, కోశాధికారి కారం బేబి, వీఆర్వోలు చెల్లయ్యమ్మ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


సర్పవరం జంక్షన్‌: పంచాయతీరాజ్‌ వ్యవస్థలో వీఆర్వోల విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా సర్పవరం జంక్షన్‌ వద్ద తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ మురళీకృష్ణకు అందించారు. కార్యరక్రమంలో వీఆర్వోల సంఘ ప్రతినిధులు నున్న సత్యనారాయణ, మస్తాన్‌, సత్యనారాయణ, దుర్గాప్రసాద్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


సామర్లకోట: తమ ప్రధాన డిమాండ్ల సాధనకు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం వీఆర్వోల సంఘ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీఎస్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌, ఆర్‌.కొండల రావు, ఇ.వెంకటేశ్వరరావు, ఖాదర్‌వల్లీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T08:33:59+05:30 IST