ఖుషినగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ జిల్లాలోని ఓ గ్రామంలో వివాహ వేడుకల సందర్భంగా జరిగిన పెద్ద ప్రమాదంతో విషాదం అలముకుంది.యూపీలోని ఖుషీనగర్‌లో ప్రమాదవశాత్తు బావిలో పడి 11 మంది మహిళలు మృతి చెందారు.బావిపై ఉన్న ఇనుప గ్రిల్ తొలగి పోవడంతో మహిళలు బావిలో పడ్డారు.ఈ ఘటన నెబువా నౌరంగియాలో జరిగింది. హల్దీ వేడుకలో పలువురు మహిళలు, యువతులు బావిపై నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా బావిపై ఉన్న ఇనుప గ్రిల్ పడిపోవడంతో మహిళలు అందులో పడిపోయారు.బావిలో పడిన 15 మంది మహిళలను గ్రామస్థులు, పోలీసులు రక్షించారు. మరో 11 మందిని సకాలంలో రక్షించలేకపోయారు.ఈ దుర్ఘటనలో మహిళలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు చికిత్స అందించాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి