Abn logo
Sep 28 2021 @ 04:18AM

ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు!

  • మంత్రులకు పవన్‌ చురకలు
  • హూ లెట్‌ ద డాగ్స్‌ ఔట్‌.. పాటను గుర్తు చేస్తూ వీడియో షేర్‌

అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘పవ న్‌ తోలు తీస్తాం.  ఆయన సన్నాసిన్నర’ అంటూ విరుచుకుపడిన మంత్రులకు... సోషల్‌ మీడియాలో ధ్వజమెత్తుతున్న వైసీపీ అభిమానులకు జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు.  వైసీపీ ‘గ్రామసింహాలు’ ఇలా అరవడం సహజమే అన్నారు. ‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు.. ఇవన్నీ సహజమే’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం ట్విటర్‌లో పోస్టు చేశారు. తర్వాత ‘హూ లెట్‌ ద డాగ్స్‌ ఔట్‌’ పాట వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేస్తూ.. నా కిష్టమైన పాటల్లో ఇదీ ఒకటి అని ట్వీట్‌ చేశారు. అంతకుముందు చేసిన మరో ట్వీట్‌లో... ‘ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు. నేటి ‘నవరత్నాలు’ భావితరాలకు ‘నవకష్టాలు’ అని పవన్‌ విమర్శించారు.

తెలంగాణ మరిన్ని...