ఏనుగు తెలివి

ABN , First Publish Date - 2022-06-30T09:35:50+05:30 IST

ఏనుగుల గుంపు రోడ్డుమీద వేగంగా వస్తోంది.

ఏనుగు తెలివి

ఏనుగుల గుంపు రోడ్డుమీద వేగంగా వస్తోంది. ఆ గుంపు మధ్యలో ఓ పిల్ల ఏనుగు ఉంది. ఆ పిల్ల ఏనుగుకి బాడీగార్డ్స్‌లా ఉన్నాయంటూ ఇటీవల ఓ వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియో సంగతి పక్కనబెడితే ఏనుగు, మనిషికి మధ్య సామ్యం ఉందంటున్నారు పరిశోధకులు. మనలాగే ఏనుగు మనస్తత్వం ఉండటంతో పాటు గొప్ప జ్ఞాపకశక్తి వాటి సొంతం. వీటి గురించి ఆసక్తికరమైన మరికొన్ని విషయాలు.

తెలివైన జంతువుల్లో ఏనుగు కథే వేరు. అలాగే ఎమోషనల్‌ కూడా. ఇతర జంతువులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేయాలనుకుంటాయి. ఇదో గొప్ప లక్షణం.

ఫ్యామిలీతో కలిసి ఉంటాయి. స్నేహితులతో సరదాగా ఆడుకోవడంతో పాటు తన మేట్స్‌తో హ్యాపీగా ఉంటాయి. ప్రేమను చూపించటానికి సిగ్గుపడవు. నేనున్నానే ఫీలింగ్‌ ఎదుటి వాటికి కలిగేట్లు చేస్తాయి.

తోటి ఏనుగులు అప్‌సెట్‌ మూడ్‌లో ఉంటే వెంటనే కనుక్కుంటాయి. 

అమ్మ ఏనుగులు ఇతర ఏనుగుల పిల్లలను కూడా ప్రేమగా చూస్తాయి. ద్వేషభావం ఉండదు. అప్పుడే పుట్టిన ఏనుగుకి బాడీగార్డుల్లా చుట్టూ ఉండి ఇతర క్రూరమృగాలనుంచి కాపాడుకుంటాయి. 

పిల్ల ఏనుగులు మూడ్‌ బాగా లేకుంటే అలిగి బురదలో పొర్లాడతాయి. 

ఏనుగును పెంచుకుంటే తన ఎమోషన్స్‌ను క్లియర్‌గా మనిషికి ఎక్స్‌ప్రెస్‌ చేస్తుంది.

ఒక ఏనుగుకి స్నేహితుడైనా, శతృవైనా పదేళ్లు తర్వాత కలిసినా గుర్తుపెట్టుకుని దానికి తగినట్లు బిహేవ్‌ చేస్తుంది. 

Updated Date - 2022-06-30T09:35:50+05:30 IST