Abn logo
Nov 25 2020 @ 07:08AM

విద్యుదాఘాతంతో ఏనుగు మృతి

హరిద్వార్ (ఉత్తరాఖండ్): విద్యుదాఘాతంతో ఓ ఏనుగు మరణించిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ సమీపంలోని బిష్ణుపూర్ గ్రామంలో వెలుగుచూసింది. బిష్ణుపూర్ గ్రామంలో 35 ఏళ్ల వయసుగల మగ ఏనుగు విద్యుదాఘాతంతో మరణించిందని అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఏనుగు కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఏనుగు మృతికి అసలు కారణాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని హరిద్వార్ ఫారెస్ట్ డివిజన్ డీఎఫ్ఓ నీరజ్ శర్మ చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తరచూ ఏనుగులు మరణిస్తుండటంపై అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement