Abn logo
May 9 2021 @ 23:23PM

తాలాడలో ఏనుగుల తిష్ఠ

భామిని: మండలంలోని తాలాడకు సమీపంలో ఏనుగులు తిష్ఠవే శాయి. శనివారం రాత్రి గ్రామ సమీపంలోని తులసి మండపం తోటలో ఉన్న కాపలాదారు షెడ్‌ను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు  భయాందోళనకు గురయ్యారు. గతంలో తాలాడ, ఘనసర, కోసలిలో అరటి, మామిడి, జీడితోటలు, మొక్కజొన్న, కూరగాయల పంటలు ధ్వంసం చేశాయి. ఉన్న కొద్దిపాటి పంటలను రక్షించుకునే సమయం లో మళ్లీ ఏనుగులు   స్వైరవిహారం చేయడంతో రైతులు భయాం దోళన చెందుతున్నారు. తాలాడకు కూత దూరంలోనే ఏనుగులు ఉండడంతో రాత్రి   గ్రామంలోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తాయేమోనని భయాందోళన  నెలకొంది.