జూలో దారుణం: భారీ ఏనుగు.. తొండంతో అతడి తలపై ఒకటే దెబ్బ..అంతే..

ABN , First Publish Date - 2021-02-27T22:59:43+05:30 IST

4 టన్నుల బరువున్న ఏనుగు తొండంతో కొట్టిన దెబ్బకు జూలోని ఓ వ్యక్తి మరణించాడు. స్పెయిన్‌లోని కాంటాబ్రియా ప్రాంతంలోగల కబార్సీనో నాచురల్ పార్క్‌లో బుధవారం నాడు ఈ ఘటన జరిగింది.

జూలో దారుణం: భారీ ఏనుగు.. తొండంతో అతడి తలపై ఒకటే దెబ్బ..అంతే..

మ్యాడ్రిడ్: 4 టన్నుల బరువున్న ఏనుగు తొండంతో కొట్టిన దెబ్బకు జూలోని ఓ వ్యక్తి మరణించాడు. స్పెయిన్‌లోని కాంటాబ్రియా ప్రాంతంలోగల కబార్సీనో నాచురల్ పార్క్‌లో బుధవారం నాడు ఈ ఘటన జరిగింది.  ఏనుగు తలపై గట్టిగా తొండంతో మోదటంతో ఆ దెబ్బకు గెటెర్రెస్ ఆర్నేయిజ్ అనే వ్యక్తి గేటులోని ఇనుప చువ్వలను ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యాడని అక్కడి అధికారులు తెలిపారు. అతడిని ఆస్పత్రికి తరిలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడని వారన్నారు. కాగా.. ఈ ఘటనపై స్థానిక పోలీసులు, జూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన ఏనుడు కడుపుతూ ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలో ఆ ఏనుగు పక్కనే మరో గున్న ఏనుగు కూడా ఉందట. కాగా.. ప్రమాదం సమయంలో గెటెర్రెస్ అక్కడి పరిసరాలను శుభ్రం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆ ఏనుగు కాలుకి కొంత కాలం క్రితం ఇన్ఫెక్షన్ సోకిందని, అక్కడి పుండు మానుతోందో లేదో తెలుసుకునేందుకు అతడు ఏనుగు సమీపానికి వెళ్లినట్టు సమాచారం. 


నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని వారు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తరచూ అదే ప్రాంతాన్ని శుభ్రపరిచేవాడని ఈ క్రమంలోనే అతడు ఎప్పుడు చూసే ఏనుగు ఏం చేయదని భావించి కాస్తంత ఏమరపాటుతో వ్యవహరించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ‘ఈ జంతువులు ఎప్పుడు ఏం చేస్తాయో చెప్పడం అసాధ్యం. 4.4 టన్నుల బరువున్న ఏనుగు తొండంతో వేసే దెబ్బను తట్టుకోవడం అసాధ్యం అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటన జరడం ఆ జూపార్క్ 30 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. కాగా.. మగ ఏనుగుల బరువు 2 నుంచి 7 టన్నుల మధ్య ఉంటుందని, ఆడ ఏనుగులు 3 నుంచి 4 టన్నుల బరువు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భూమ్మీద ప్రస్తుతమున్న జంతువుల్లో ఆఫ్రికా జాతీ ఏనుగులే అతిపెద్దవని వారు తెలిపారు. 

Updated Date - 2021-02-27T22:59:43+05:30 IST