అమ్మో.. ఇలాంటి స్నేహితుడు ఎవరికీ వద్దు!

ABN , First Publish Date - 2020-04-08T01:50:07+05:30 IST

స్నేహితుడంటే మనకోసం ఎంత రిస్కయినా చేసేవాడు. మన బాధల్ని, సంతోషాల్ని పంచుకునేవాడు.

అమ్మో.. ఇలాంటి స్నేహితుడు ఎవరికీ వద్దు!

ఇంటర్నెట్ డెస్క్: స్నేహితుడంటే మనకోసం ఎంత రిస్కయినా చేసేవాడు. మన బాధల్ని, సంతోషాల్ని పంచుకునేవాడు. మనం కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడిచేవాడు. ఇలా చెప్పుకుంటూపోతే స్నేహం గురించి, స్నేహితుల గురించి అబ్బో అంతులేకుండా చెప్పుకోవచ్చు. అందుకే ‘ప్రతి ఫ్రెండూ అవసరమేరా’ అని మనమంతా నినదిస్తాం. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం అంత నిబ్బరంగా ఆ మాట అనలేం. ఎందుకంటే ఈ వీడియోలో మిత్రుడు అంత ద్రోహం చేశాడు. విషయం ఏంటంటే.. రెండు ఏనుగు గున్నలు ఓ కాలువ దగ్గరకు వచ్చాయి. కానీ దాన్ని దాటడానికి భయపడి వెనకడుగు వేశాయి. అదే సమయంలో వాటిలో ఓ గున్న.. తన పక్కనే ఉన్న ఏనుగు పిల్లను ఒక్క తోపు తోసింది. ఆ దెబ్బకు ఆ గున్న వెళ్లి కాలువలో పడింది. ఇక ఈ వీడియో చూసిన వారంతా పగలబడి నవ్వుతున్నారు. కొందరేమో ‘ఇలాంటి మిత్రుడుంటే ఇక శత్రువులెందుకు?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-04-08T01:50:07+05:30 IST