Abn logo
Sep 29 2021 @ 07:36AM

Viral Video: ఈ డ్రైవర్ చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా.. ఎదురుగా ఏనుగు వచ్చి, బస్సును ఢీకొడుతున్నా...

ఏనుగులు చేసే చేష్టలకు సంబంధించిన వీడియోలను చూసేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. ఒక్కోసారి అవే ఏనుగుల చేష్టలు మనుషులకు ప్రాణాంతకంగా మారుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. దానిలో ప్రయాణీకులతో ఉన్న బస్సుపై ఒక ఏనుగు దాడి చేస్తున్న వైనం కనిపిస్తుంది. ఈ సమయంలో ఆ బస్సు డ్రైవర్ అత్యంత సాహసం ప్రదర్శిస్తూ ఆ ఏనుగు కోపాన్ని చల్లార్చాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్ తెలివితేటను మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు అత్యంత వేగంగా వైరల్ అవుతోంది. 

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ సెప్టెంబరు 25న తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరిలో చోటుచేసుకున్నదని ఆమె తెలిపారు. ఒక డ్రైవర్ తాను నడుపుతున్న బస్సుపై ఒక ఏనుగు దాడి చేస్తుండగా, ఏమాత్రం భయపడకుండా దాని ఆగ్రహాన్ని శాంతింపజేయడంతో పాటు ప్రయాణీకులను కాపాడారు. సుప్రియా సాహూ ఈ వీడియోకు క్యాప్షన్‌గా... ఈ ప్రభుత్వ బస్సు డ్రైవర్‌ను హృదయపూర్వకంగా మెచ్చుకుంటున్నాను. ఏనుగు... బస్సు అద్దాలను పగులగొట్టినప్పటికీ, డ్రైవర్ అత్యంత చాకచక్యం ప్రదర్శిస్తూ ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాడు. ప్రశాంతమైన మనసు అద్భుతాలను చేస్తుందని ఆమె రాశారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 68 వేల మంది వీక్షించారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...