సీఎం జగన్‌‌తో ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌ లిమిటెడ్‌ ఎండీ భేటీ

ABN , First Publish Date - 2022-02-17T02:28:37+05:30 IST

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌ లిమిటెడ్‌

సీఎం జగన్‌‌తో ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌ లిమిటెడ్‌ ఎండీ భేటీ

అమరావతి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఉమాంగ్‌ కేజ్రీవాల్, ఎలక్ట్రోస్టీల్‌ క్యాస్టింగ్స్‌ లిమిటెడ్‌ అనుబంధ కంపెనీ శ్రీకాళహస్తి పైప్స్‌ సీవోవో సురేష్‌ ఖండేల్వాల్‌ కలిశారు. డక్టైల్‌ ఐరన్‌ పైప్స్‌ తయారీలో దేశంలోనే ప్రముఖ కంపెనీగా దీనికి పేరు ఉంది. 90కి పైగా దేశాలకు ఉత్పత్తులను ఈ కంపెనీ ఎగుమతులు చేస్తున్నది. ఏపీలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు సీఎంకు ఎండీ ఉమాంగ్‌ కేజ్రీవాల్‌ వివరించారు. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా  ఏడాదికి 0.5 మిలియన్‌ టన్నులు పెంచేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-17T02:28:37+05:30 IST