విద్యుత్‌ శాఖ బకాయిలు చెల్లించండి

ABN , First Publish Date - 2020-11-25T04:55:23+05:30 IST

జిల్లాలోని గ్రామాల్లో వీధిలైట్లు, తాగునీటి మోటార్లకు విద్యుత్‌ వాడకానికి సంబంధించి విద్యుత్‌ శాఖకు పంచాయతీలు పెండింగ్‌ ఉన్న బకాయిలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని డివిజనల్‌ పంచాయతీ అధికారులకు డీపీవో ధనలక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

విద్యుత్‌ శాఖ బకాయిలు చెల్లించండి

నెల్లూరు(జడ్పీ), నవంబరు 24: జిల్లాలోని గ్రామాల్లో వీధిలైట్లు, తాగునీటి మోటార్లకు విద్యుత్‌ వాడకానికి సంబంధించి విద్యుత్‌ శాఖకు పంచాయతీలు పెండింగ్‌ ఉన్న బకాయిలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని డివిజనల్‌ పంచాయతీ అధికారులకు డీపీవో ధనలక్ష్మి మంగళవారం  ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విద్యుత్‌ బకాయిలు కనీసం 40శాతం మేర చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి రూ.244.50 కోట్లు బకాయిలు ఉన్నాయని వీటిని చెల్లించాలని విద్యుత్‌శాఖ పలుదఫాలు కోరి ఉన్నందున 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 40శాతం మొత్తాన్ని విద్యుత్‌ బకాయిలను చెల్లించాలని ఆమె ఆదేశించారు. 

Updated Date - 2020-11-25T04:55:23+05:30 IST