విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు చర్యలు

ABN , First Publish Date - 2021-11-10T16:39:36+05:30 IST

నగరంలో నీరు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్టు, వీటిని త్వరలో పునరుద్ధరిస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ తెలిపారు. స్థానిక పెరంబూర్‌ బీసీ మిల్లు, పెరియార్‌ నగర్‌

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు చర్యలు

                      - మంత్రి సెంథిల్‌ బాలాజీ


పెరంబూర్(చెన్నై): నగరంలో నీరు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్టు, వీటిని త్వరలో పునరుద్ధరిస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ తెలిపారు. స్థానిక పెరంబూర్‌ బీసీ మిల్లు, పెరియార్‌ నగర్‌ ప్రాంతంల్లోని 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాలను మంగళవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో 223 ఉప విద్యుత్‌ కేంద్రాలు ఉండగా, ఒక కేంద్రంలో మాత్రం నీరు ప్రవేశించడంతో తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశామన్నారు. రెండు రోజుల కిత్రం ముంపు ప్రాంతాల్లో 12,200 కనెక్షన్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయగా, ప్రస్తుతం 4,650 కనెక్షన్లకు మాత్రమే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాల్సి ఉందన్నారు.

Updated Date - 2021-11-10T16:39:36+05:30 IST