విద్యుత్‌ సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దు

ABN , First Publish Date - 2022-08-09T07:05:37+05:30 IST

విద్యుత్‌ సంస్థ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎన్‌సీసీఈఈఈ దేశవ్యాప్త పిలుపు మేరకు బొమ్మూరు 220కేవీ సబ్‌స్టేషన్‌ వద్ద సోమవారం జేఏసీ చైర్మన్‌ జగతా అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

విద్యుత్‌ సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దు

బొమ్మూరు, ఆగస్టు 8: విద్యుత్‌ సంస్థ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎన్‌సీసీఈఈఈ దేశవ్యాప్త పిలుపు మేరకు బొమ్మూరు 220కేవీ సబ్‌స్టేషన్‌ వద్ద సోమవారం జేఏసీ చైర్మన్‌ జగతా అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యుత్‌ సంస్థలకు భారీ నష్టాలు వస్తున్నాయనే వంకతో విద్యుత్‌ సరఫరా డిస్క్‌ం సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. కేంద్రం పునరాలోచించి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు కోరారు. సెక్రటరీ జనరల్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ కేంద్రం ప్రైవేటీకరణ బిల్లును పార్లమెంట్‌లో పెడితే ఆందోళ నను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రీజనల్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌బాబు, అసిస్టెంట్‌ సెక్రటరీ కె.రామరాజు, అసిస్టెంట్‌ సెక్రటరీ పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T07:05:37+05:30 IST