హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగ దారుల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ఒక ప్రత్యేక యాప్ లను ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ ఇప్పటి వరకూ విద్యుత్ సరఫరాలో సమస్యలు, ఇతర వాటిని పరిష్కరించడానికి వినియోగ దారులు కన్సూమర్ గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం అవుతోందని వినియోగ దారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో విద్యుత్ వినియోగ దారుల నుంచి మరింత సులభతరమైన పద్దతిలో ఫిర్యాదులను స్వీకరించడానికి వెబ్, మొబైల్ ఆదారిత పోర్టల్ ను అధికారులు అమలులోకి తీసుకు రానున్నారు. ఈ నెల 28న రెడ్ హిల్స్ లోని సింగరేణి భవన్ లో ఈ సరికొత్త పోర్టల్ ను ప్రారంభించనున్నట్టు తెలంగాణ స్టేట్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ఈఆర్ సి) కార్యదర్శి డా. ఉమాకాంత పాండ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి