విద్యుత్ చార్జీలు తగ్గించాలి!

ABN , First Publish Date - 2020-03-31T09:23:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం యూనిట్ ధర రెండు రూపాయలకే కొంటున్నట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయి...

విద్యుత్ చార్జీలు తగ్గించాలి!

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం యూనిట్ ధర రెండు రూపాయలకే కొంటున్నట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల జీవికలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు బిల్లులు చెల్లించే స్థితిలో లేరు. అందువలన ప్రభుత్వం విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించాలి. ఈ విషయంలో విద్యుత్ నియంత్రణ మండలి జోక్యం చేసుకొని విద్యుత్ చార్జీలు తగ్గించటానికి విద్యుత్ సరఫరా సంస్థలకు తగు ఆదేశాలు ఇవ్వాలి.

పాతూరు దిలీప్ కుమార్, తిరుపతి

Updated Date - 2020-03-31T09:23:58+05:30 IST