Abn logo
May 22 2020 @ 05:54AM

విద్యుత్‌ బిల్లు పేదలపై పెనుభారం

ఖాజీపేట, మే21: కరోనా సమయంలో ప్రజలపై విద్యుత్తు ఛార్జీలు పెను భారమని జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శ నాస్త్రాలు సంధించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఖాజీపేట మండలం దుంపలగట్టులో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి స్వగృ హంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన మాట్లాడుతూ మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా అంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 24 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తూ ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్‌ రెడ్డి, నారాయణ యాదవ్‌, ఫరూఖ్‌ అహమ్మద్‌, సుధాకర్‌ యాదవ్‌, నంద్యాల సుబ్బయ్య, హర్షద్‌, రవి, పల్లె గంగులయ్య, రెడ్యం నాగేశ్వరరెడ్డి, వెంకటరెడ్డి  పాల్గొన్నారు.


కరోనా సమయంలోనూ పెంచిన విద్యుత్‌ బిల్లులతో పేదలపై భారం మోపడ మేనని తెలుగుయువత జిల్లా అధికార ప్రతినిధి కొలవళి వేణుగోపాల్‌ నిరసన  వ్యక్తం చేశారు. విద్యుత్‌ బిల్లులు తక్షణమే తగ్గించాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. పెంచిన విద్యుత్‌ బిల్లులు రద్దు చేయకపోతే ఆందోళనలు చేపడతామన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మైదుకూరులో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాస రి బాబు తన కార్యాలయంలో  నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్‌ చార్జీలపెంపు, ప్రభుత్వ భూములు అమ్మకం తదితర ప్రజా వ్యతిరేక వి ధానాలకు పాల్పడుతోందంటూ విమర్శించారు.

Advertisement
Advertisement
Advertisement