రైతుల గోస పట్టని విద్యుత్‌ అధికారులు

ABN , First Publish Date - 2021-06-13T04:53:18+05:30 IST

వానకాలం మొదలైంది, వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు విత్తనాలు వేయడానికి సిద్ధం అవుతున్నారు. కానీ రైతులకు విద్యుత్‌ అధికారులు సహకారం మాత్రం అందించడం లేదు.

రైతుల గోస పట్టని విద్యుత్‌ అధికారులు
కన్కల్‌ శివారులో చేతికి అందేలా విద్యుత్‌ వైర్లు.. స్తంభం ఎక్కి సరిచేస్తున్న రైతులు

 రైతుల విద్యుత్‌ సమస్యలపై అధికారుల స్పందన కరువు 

  ఇబ్బందులు పడుతున్న కర్షకులు

తాడ్వాయి, జూన్‌ 12: వానకాలం మొదలైంది, వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు విత్తనాలు వేయడానికి సిద్ధం అవుతున్నారు. కానీ రైతులకు విద్యుత్‌ అధికారులు సహకారం మాత్రం అందించడం లేదు. రోజురోజుకూ ట్రాన్స్‌ కో అధికారుల పనితీరు భిన్నంగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమను ఎవరు అడుగుతారులే అనే ధీమాతో ప్రజా సమస్యలపై పట్టింపులేని తనాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని కన్కల్‌ గ్రామ శివారులో ఎస్‌ఎస్‌-2 ట్రాన్మ్‌ఫార్మర్‌ నుంచి వెళ్లే విద్యుత్‌ వైర్లు చేతికి అందేలా కిందకి వేలాడుతున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు విద్యుత్‌ అధికారులకు విన్నవించినా పెడచెవిన పెట్టారు. లైన్‌మెన్‌తో మొ దలుకుని జిల్లా కార్యాలయంలోని విద్యుత్‌ డీఈకి సైతం సమస్యను రైతులు విన్న వించారు. ఏ స్థాయిలోని అధికారి కూడా స్పందించకపోవడంతో రైతులే విద్యుత్‌ అధికారులుగా మారారు. తమ ప్రాణాలు పోగొట్టుకునే కంటే తామే బాగు చేసు కుంటామని సంకల్పించి విద్యుత్‌ స్తంభాల పైకి ఎక్కి విద్యుత్‌ వైర్లను సరి చేశా రు. ఈ ఒక్క సమస్యనే కాదని, ఇటీవల బోర్లకు విద్యుత్‌ సరాఫరా కావడం లేదని విన్నవిస్తే నిర్లక్ష్యం వహించారే తప్ప సరిచేసే ప్రయత్నాలు చేయలేదని బాధిత రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ శరత్‌ విద్యుత్‌శాఖ అధికారుల పని తీరుపై దృష్టి సారించి, సమస్యలపై తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

వజ్రకండి - డోన్‌గాం రహదారి వెంబడి ప్రమాదకరంగా విద్యుత్‌ స్తంభాలు

జుక్కల్‌: జుక్కల్‌ మండలంలోని వజ్రకండి-డోన్‌గాం గ్రామాల రహదారి వెంబ డి ఉన్న విద్యుత్‌ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల కురిసిన  వర్షాల కు విద్యుత్‌ స్తంభాల కింది భాగంలో మొరం, మట్టి కొట్టుకుపోయింది. మరో భారీ వర్షం కురిస్తే కూలిపోయే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో, మరే సమయంలోనైనా విద్యుత్‌ స్తంభాలు కూలిపోతే ప్రాణ నష్టం జరిగే ప్రమాదముంది. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు భ యాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ శాఖాధికారులు స్పందించి  ప్రమాదం జరుగకముందే విద్యుత్‌ స్తంభాలను సరి చేయాలని మరమ్మతులు చేయాలని, కూలకుండా చూడాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - 2021-06-13T04:53:18+05:30 IST