విద్యుత్‌, నీటి సమస్య లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2022-05-24T05:21:56+05:30 IST

మండలంలో విద్యుత్‌, తాగు నీటి సమస్య లేకుండా చుడాలని ఎంపీపీ విశ్వనాథ్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ విశ్వనాథ్‌ ఆధ్యక్షతన సోమవారం మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.

విద్యుత్‌, నీటి సమస్య లేకుండా చూడాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ విశ్వనాథ్‌

- మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపీపీ విశ్వనాథ్‌

కౌటాల, మే 23: మండలంలో విద్యుత్‌, తాగు నీటి సమస్య లేకుండా చుడాలని ఎంపీపీ  విశ్వనాథ్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ విశ్వనాథ్‌ ఆధ్యక్షతన సోమవారం  మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్‌, నీటి పారుదల శాఖలపై ప్రతి సమావేశంలో సభ్యులు సమాస్యలను ప్రస్తావిస్తున్నారని చెప్పారు. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదని అన్నారు. అనంతరం  విద్యుత్‌ శాఖ ఏఈ రవిందర్‌ మాట్లాడుతుండగా సభ్యులు దుర్గం మోతిరాం, సర్పంచులు మౌనిష్‌, దామోదర్‌, రేణుకలు అయా గ్రామాలలోని విద్యుత్‌ సమస్యలపై నిలదీశారు. ప్రతి సమావేశంలో సమస్యలు ప్రస్తావించిన సమస్యలు మాత్రం తీరడంలేదని ఆగ్రహం వ్యక్తం చేవారు. అలాగే గ్రామాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. కౌటాల మండల కేంద్రంలో 50 శాతం మందికి నీరందడంలేదని సభ్యులు ప్రస్తారించారు. అధికారులు పని చేయిస్తే కనీసం సమాచారం ఇవ్వడంలేదని పలువురు సర్పంచులు సమావేశంలో ప్రస్తావించారు. బాలేపల్లి సర్పంచ్‌ ద్రుపద నీటి సమస్యను ప్రస్తవించారు. అధికారులు మాట్లాడుతూ మీకు అవగాహన లేదని సార్‌కు చెప్పనని అన్నారు.  అదే విధంగా వీర్దండి సర్పంచ్‌ రేణుకకు సైతం ఇలాంటి సమాధానమే ఇవ్వడంతో సభ్యులు ఆశ్చర్యపోయారు. అనంతరం అయా శాఖల అధికారులు తమ తమ నివేదికలను చదివి వినిపించారు. ఎంపీపీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ అధికారులు సభ్యులు ప్రస్తావించిన సమస్యలను నోట్‌ చేసుకుని పరిష్కరించాలని సూచించారు. రాబోయే వర్షకాలంలో విద్యుత్‌ సమస్య లేకుండా చూడాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ అనూష, ఎంపీడీవో నస్రూల్లాఖాన్‌, ఎంపీవో సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:21:56+05:30 IST