Abn logo
Apr 13 2021 @ 00:23AM

అంగీకారం లేకుండానే విద్యుతలైన పనులు

సోమందేపల్లి(పెనుకొండ టౌన), ఏప్రిల్‌ 12: రైతుల పొలాల్లో అనుమతులు లేకుండానే 220 కేవీ విద్యుతలైన పనులు చేపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని కేతగానిచెరువుకు చెందిన రైతులతో కలిసి తహసీల్దార్‌ సురే్‌షకు వినతిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2003విద్యుత చట్టం ప్రకారం రైతులకు నోటీసులు ఇచ్చి వారి అంగీకారంతో విద్యుత పనులు చేపట్టాలన్నారు. స్పందించి తహసీల్దార్‌ ట్రాన్సకో అధికారులను పిలిపించి రైతుల సమక్షంలో విచారించారు. రైతులకు నష్టపరిహారంపై గ్రామసభ ఏర్పాటుచేసి చట్టప్రకారం న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశులు, ఆవాజ్‌ చాంద్‌బాష, సతీష్‌, రైతులు రవి, సోమశేఖర్‌, వెంకటేశ, అంజినప్పలు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement