ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేస్తే బెటరేనా.. ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే..

ABN , First Publish Date - 2021-09-13T17:41:28+05:30 IST

కంటికి అచ్చంగా కనిపించని వాటిలో విద్యుత్తు ఒకటి. ఇంట్లో బల్బు వెలుగుతుంది. మిక్సీ పని చేస్తుంది. పైకి కనిపించే ఆ రెండు ఆకారాలు కరెంట్‌ సహకారంతో మాత్రమే వినియోగంలోకి వస్తాయి. అయితే, ఆ రెంటికి ఆధారమైన కరెంటు మాత్రం మనకు స్పష్టంగా కనిపించదు. కరెంట్‌ లేకుండా నేడు

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేస్తే బెటరేనా.. ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే..

కంటికి అచ్చంగా కనిపించని వాటిలో విద్యుత్తు ఒకటి. ఇంట్లో బల్బు వెలుగుతుంది. మిక్సీ పని చేస్తుంది. పైకి కనిపించే ఆ రెండు ఆకారాలు కరెంట్‌ సహకారంతో మాత్రమే వినియోగంలోకి వస్తాయి. అయితే, ఆ రెంటికి ఆధారమైన కరెంటు మాత్రం మనకు స్పష్టంగా కనిపించదు.  కరెంట్‌ లేకుండా నేడు ప్రపంచాన్ని ఊహించలేం.  నేటి ఐటి, ఎలకా్ట్రనిక్స్‌ తదితర విభాగాలన్నింటికీ మాతృక ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. కోర్‌ సబ్జెక్టుగా దీనికి ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుంది.  ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలేజీలు ఈ సబ్జెక్టును అందిస్తున్నాయి. కేవలం ఐఐటీల్లో మాత్రమే దీన్ని ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌గా చూస్తాం.


ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో సర్క్యూట్స్‌ కీలకం. దీనిపై పూర్తి స్థాయి పట్టు సాధించిన వ్యక్తి ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా వృత్తిలో చాలా బాగా ఇమిడిపోవచ్చు. ఈ కోర్సులో పవర్‌ ప్రొడక్షన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ (విద్యుత్తు ఉత్పత్తి, చేరవేత, పంపిణి)పై విస్తృత అవగాహన సాధించాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీలో భాగంగా ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, పవర్‌ ఎలక్ట్రికల్‌, సంబంధిత మెషిన్స్‌, మెజర్‌మెంట్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, యుటిలైజేషన్‌, డిజిటల్‌ ఎలకా్ట్రనిక్స్‌, మైక్రోప్రాసెసర్స్‌ తదితరాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే మెకానికల్‌, సివిల్‌, ఎలకా్ట్రనిక్స్‌తో కలగలిసిన అంశాలూ ఉంటాయి. వాటితో ఈ కోర్సుకు ఉన్న అనుబంధం మేరకు చదవాల్సి ఉంటుంది.


అయితే, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కాలక్రమంలో అనేకానేక విభాగాలకు  నెలవైంది. కంప్యూటర్స్‌ ఇంజనీరింగ్‌, సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌, పవర్‌ ఇంజనీరింగ్‌, టెలికమ్యూనికేషన్స్‌, రేడియో-ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఆప్టిక్స్‌ అండ్‌ ఫోటోనిక్స్‌గా అవతారం ఎత్తాయి.  వీటిల్లో కొన్ని సబ్జెక్టులు ఒకటికి మించి ఈ డిసిప్లిన్‌లలో బోధన అంశంగా ఉంటుంది. హార్డ్‌వేర్‌ ఇంజనీరింగ్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రో మేగ్నటిక్‌ అండ్‌ వేవ్స్‌, మైక్రోవేవ్‌ ఇంజనీరింగ్‌ నానో టెక్నాలజీ,  కెమిస్ట్రీ, రెన్యువబుల్‌ ఎనర్జీ, మెకొట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ మెటీరియల్స్‌ సైన్స్‌ వంటి స్పెషలైజేషన్స్‌ ఇందులోనే ఉన్నాయి. 


సాధారణంగా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందుతారు  ప్రాక్టీసింగ్‌ ఇంజనీర్లు ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌తో పలు ప్రొఫెషనల్‌ బాడీలలో సభ్యత్వం తీసుకుంటారు. ఇంటర్నేషనల్‌ ఎలకో్ట్రటెక్నికల్‌ కమిషన్‌(ఐఇసి), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్‌(ఐఇఇఇ), ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఇటి)లో సభ్యులుగా చేరుతారు. పవర్‌ అండ్‌ ఎనర్జీ టెలికమ్యూనికేషన్స్‌, ఆటోమేషన్‌ అండ్‌ కంట్రోల్‌  ఎలకా్ట్రనిక్స్‌, మైక్రోఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ నానో ఎలకా్ట్రనిక్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్స్‌, ఆప్టిక్స్‌ అండ్‌ ఫొటోనిక్స్‌ ఏరియాలో పనిచేయగలుగుతారు. విద్యుత్తుతో పనిచేసే వాహనాలు, కంప్యూటర్లు, డిజిటల్‌ డివైస్‌లు, ఎలకా్ట్రనిక్‌ మెమరీ స్టోరేజ్‌ డివైసెస్‌, ఇండస్ట్రియల్‌ రోబోట్స్‌, సీఎన్‌సీ మెషీన్స్‌కు సర్క్యూట్స్‌ డిజైన్‌ చేయగలుగుతారు. ఇఇఇ ఇంజనీర్లు టెలికమ్యూనికేషన్‌, వైర్‌లెస్‌, ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ల సెటప్‌ అలాగే ఆపరేషన్‌లోనూ ఇతోధిక పాత్ర పోషించగలరు.


ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌

ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు అందించే కోర్సుల్లో ఒకటి. ఒకరు ఇంకొకరితో మాట్లాడుకోవడమే కమ్యూనికేషన్‌. కమ్యూనికేషన్‌ లేనిదే ప్రపంచమే లేదు. ఈసీఈ అనేది ఆధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థకు వెన్నెముక. రాకెట్‌ సైన్స్‌, టెలీ కమ్యూనికేషన్‌ సహా ప్రతి దానిని ఇది నియంత్రిస్తుంది. మనం రోజూ ఉపయోగించే పరికరాల(రేడియో, టీవీ, రిఫ్రిజిరేటర్‌, మైక్రోవేవ్‌ ఓవెన్‌, కంప్యూటర్‌, ఫోన్‌ వాచ్‌ ఇలా చెప్పుకొంటూ పోతే చాలా వస్తువులు వస్తాయి)న్నింటిలో  ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌కి సంబంధించిన అంశం ఉంటుంది. 


ఎలక్ర్టానిక్‌ పరికరాలు, సర్క్యూట్స్‌, సిగ్నల్‌ వ్యవస్థలు, డిజిటల్‌ లాజిక్‌ డిజైన్‌, అనలాగ్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌, రాడార్‌ ఇంజనీరింగ్‌, యాంటెనాలు, వేవ్‌ ట్రాన్స్‌మిషన్‌, మైక్రోవేవ్‌ ఇంజనీరింగ్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, అనలాగ్‌, డిజిటల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు, సాంకేతికంగా అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఈ ప్రోగ్రామ్‌లో ఉన్నాయి. విద్యార్థులు వారి పూర్తి సామర్థ్యాన్ని సాధించేలా పరిశోధన, సృజనాత్మకత, ఆవిష్కరణ చేసే ఆలోచనలకు ప్రయోగశాలలు ఉపయోగపడతాయి. 


ఆధునిక ప్రపంచ అవసరాలను తీర్చడానికి వినూత్న పరిష్కారాలను అందించడం ఈసీఈ ఇంజనీర్ల బాధ్యత. ఆ ప్రయోజనం కోసం ఇంజనీరింగ్‌ వృత్తిలో ప్రత్యేక నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఈ నాలుగేళ్ల కార్యక్రమం విద్యార్థికి ఈసీఈలో అందించే అంశాలకు తోడు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, కృత్రిమ మేథస్సు, మెషీన్‌ లెర్నింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, రోబోటిక్స్‌ వంటి రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం కల్పిస్తారు. రోబోటిక్స్‌ అనేది రోబోల రూపకల్పన, అనువర్తనంతో వ్యవహరించే మరో ముఖ్యమైన విభాగం. ఎలక్ర్టానిక్స్‌, కమ్యూనికేషన్ల రంగంలో రోబోటిక్స్‌ ఒక హాట్‌ ట్రెండ్‌. రోబోలను వివిధ రంగాల్లో ఉపయోగిస్తున్నారు. పారిశ్రామిక తయారీ ప్రక్రియ, న్యూక్లియర్‌ సైన్స్‌, డిఫెన్స్‌ సిస్టమ్‌, కమ్యూనికేషన్‌ సహా మరెన్నో.


ప్రసిద్ధ సంస్థల్లో ఉన్నత, ఎగ్జిక్యూటివ్‌ అవకాశాలను పొందవచ్చు. ఉదాహరణకు దేశంలో ఇస్రో, డిఆర్‌డిఓ, బీడీఎల్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఎలక్ర్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఇండియా, భారత్‌ హెవీ ఎలక్ర్టికల్స్‌ లిమిటెడ్‌,  ఎన్‌పీటీఎల్‌, భారతీయ రైల్వేలు, భారత టెలీ కమ్యూనికేషన్స్‌లో జాబ్‌ పొందవచ్చు. అలాగే ప్రైవేటు రంగంలో ఇంటెల్‌ కార్పొరేషన్‌, శాంసంగ్‌ ఎలక్ర్టానిక్స్‌, టెక్సాస్‌ ఇన్స్‌ట్రుమెంట్స్‌, ఫిలిప్స్‌ సెమీ కండక్టర్స్‌లోనూ జాబ్స్‌ లభిస్తాయి.



బయో ఇంజనీరింగ్‌

బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ లాంటిదే. అయితే పూర్తిగా మెడిసిన్‌ ఇండస్ట్రీతో మమేకమవుతుంది. ఈ డిసిప్లిన్‌ మెడిసిన్‌ ఆధారితం. సంబంధిత ఆర్‌్క్షడిలో వీరికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూనివర్సిటీలు, అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. విప్రో మెడికల్‌, సయామిన్స్‌ వంటి సంస్థల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయి. టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఫైబర్‌ ఇంజనీరింగ్‌ మెకానికల్‌, కెమికల్‌ కలగలిసిన ఇంజనీరింగ్‌ ఇది. అయితే టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సును తీర్చిదిద్దారు. టెక్స్‌టైల్‌ రంగంలో అవసరమైన పరికరాల డిజైన్‌, రూపకల్పన కోర్సులో భాగం. టెక్స్‌టైల్‌ ఫీల్డ్‌లో పర్యవేక్షణ, ప్రక్రియ, పరిశోధన, ఆపరేషన్స్‌, సేల్స్‌, సాంకేతిక విభాగాల్లో వీరి సేవలు అవసరమవుతాయి. మైసూర్‌ సిల్క్స్‌, రిలయన్స్‌, బాంబే డైయింగ్‌, అరవింద్‌ మిల్స్‌  తదితర వస్ర్తాల ఉత్పత్తి కంపెనీల్లోనూ వీరికి అవకాశాలు ఉంటాయి.



బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌

లైఫ్‌ సైన్సెస్‌ అంటే బయాలజీపై ఆసక్తికి తోడు మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ కూడా ఇష్టమైతే బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ని ఎంపిక చేసుకోవచ్చు. సైన్స్‌, సాంకేతిక అంశాలను కలగలిపి పనిచేయడం దీనిలోని ప్రత్యేకత. ముఖ్యంగా పేషెంట్‌ మానిటరింగ్‌ ఎక్వి్‌పమెంట్‌, మెడికల్‌ ఇమేజర్లు, సర్జికల్‌ టూల్స్‌, ఆర్టిఫీషియల్‌ ఆర్గాన్స్‌ ఇందులోకి వస్తాయి. బీటెక్‌ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌తో ఈ రంగంలోకి చేరవచ్చు. ఫార్మాస్యూటికల్‌, మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, సప్లయీస్‌ ఇండస్ట్రీల్లో వీరికి అవకాశాలు ఉంటాయి.



కెమికల్‌ ఇంజనీరింగ్‌ 

కెమిస్ట్రీపై అభిమానానికి తోడు ఇంజనీరింగ్‌ కూడా చేయాలనుకుంటే ఈ బ్రాంచ్‌ బెస్ట్‌. రసాయన శాస్త్ర సంశ్లేషణ, ఫార్మాస్యూటికల్స్‌, కాస్మోటిక్స్‌ వంటి కొన్ని ప్రత్యేక ఉత్పత్తుల గురించి ఇందులో ఉంటుంది. రసాయన ఉత్పత్తి ప్రక్రియలో ప్రొడక్ట్‌, మాన్యుఫాక్చర్‌ పనులు కెమికల్‌ ఇంజనీర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. మాలిక్యూల్స్‌ వాటి ప్రతి చర్యలను తెలుసుకోవాలి. ప్రత్యేకించి ఒక కెమికల్‌ ప్రాసెస్‌ పైనా అధ్యయనం చేయవచ్చు. ఈ కోర్సు చేసిన ఇంజనీర్లకు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. మాన్యుఫాక్చరింగ్‌, ప్రాసెసింగ్‌, కెమికల్‌ ప్రాసెస్‌ ఇండస్ట్రీల్లో జాబ్‌లు లభిస్తాయి. ఎరువులు, రసాయన మందులు, ప్రత్యేక కెమికల్స్‌, డైస్‌, పెయింట్స్‌, లూబ్రికెంట్స్‌ తదితరాల్లోనూ వీరి పాత్ర ఉంటుంది. డిఫెన్స్‌, ఆటమిక్‌ పవర్‌ ఎస్టాబ్లి్‌షమెంట్లలో అవకాశాలు ఉంటాయి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై వీరు పరిశోధన కూడా చేయవచ్చు.



మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌

ప్రత్యేకించి ఒక ప్రొడక్ట్‌ కోసం ఎటువంటి మెటీరియల్‌ ఎందుకు, ఎలా ఉపయోగించాలన్నది ఈ ఇంజనీరింగ్‌లో ప్రత్యేకంగా బోధిస్తారు. టెస్ట్‌, ఫాబ్రికేట్‌ మెటీరియల్స్‌ సంస్థలు వీరికి ఉద్యోగాలను ఇస్తాయి. ఉత్పత్తుల సృష్టికి ఉద్దేశించిన టెస్ట్‌ మెటీరియల్స్‌ను ఈ ఇంజనీర్లు డెవలప్‌ చేస్తారు. సిరామిక్స్‌, మెటల్స్‌, ప్లాస్టిక్స్‌, గ్లాస్‌ తదితరాలన్నీ వీటి కిందకు వస్తాయి. ముఖ్యంగా స్టీల్‌ కంపెనీలు మెటీరియల్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజనీర్లను తీసుకుంటాయి. దేశ, విదేశాల్లో అవకాశాలు ఉంటాయి. సెయిల్‌, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, ఇస్పాత్‌ ఇండస్ట్రీస్‌ అలాగే వివిధ ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. 



టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఫైబర్‌ ఇంజనీరింగ్‌

మెకానికల్‌, కెమికల్‌ కలగలిసిన ఇంజనీరింగ్‌ ఇది. అయితే టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సును తీర్చిదిద్దారు. టెక్స్‌టైల్‌ రంగంలో అవసరమైన పరికరాల డిజైన్‌, రూపకల్పన కోర్సులో భాగమై ఉంటుంది. టెక్స్‌టైల్‌ ఫీల్డ్‌లో పర్యవేక్షణ, ప్రక్రియ, పరిశోధన, ఆపరేషన్స్‌, సేల్స్‌, సాంకేతిక విభాగాల్లో వీరి సేవలు అవసరమవుతాయి. మైసూర్‌ సిల్క్స్‌, రిలయన్స్‌, బాంబే డైయింగ్‌, అరవింద్‌ మిల్స్‌  తదితర వస్త్రాల ఉత్పత్తి కంపెనీల్లోనూ వీరికి అవకాశాలు ఉంటాయి.


ఇది కూడా చదవండి

‘అగ్రిటెక్‌’ కోర్సులు.. ఎంపీసీతో అవకాశాలు అపారం..

Updated Date - 2021-09-13T17:41:28+05:30 IST