పేదలకు విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వండి

ABN , First Publish Date - 2022-01-28T06:20:32+05:30 IST

రూ.కోట్ల లాభాలు గడించే సంస్థలకు కాదు.. పేదలకు విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వాలని పలువురు వినియోగదారులు డిమాండ్‌ చేశారు.

పేదలకు విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వండి
వర్చువల్‌ విధానంలో అభిప్రాయం వెల్లడిస్తున్న గ్రామస్థులు

చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల డిమాండ్‌

తుళ్లూరు, జనవరి 27: రూ.కోట్ల లాభాలు గడించే సంస్థలకు కాదు.. పేదలకు విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వాలని పలువురు వినియోగదారులు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ చార్జీల పంపు అంశంపై విశాఖ నుంచి వర్చువల్‌ విధానంలో విద్యుత్‌ నియంత్రణ మండలి ఆన్‌లైన్‌లో అభిప్రాయ సేకరణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాయపూడి సీఆర్డీఏ సర్కిల్‌ విద్యుత్‌ కార్యాలయం నుంచి పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఏబీసీ గ్రేడ్ల ఆధారంగా పెరిగిన యూనిట్లకు విద్యుత్‌ చార్జీలు వేయడం పేదలకు భారంగా మారిందన్నారు. దానిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. బహిరంగంగా రూ.కోట్ల లాభాలు చూపిస్తున్న కంపెనీలు,  సంస్థలకు ఏ గ్రేడ్‌ లేకుండా యూనిట్‌ రూ.6.30 మాత్రమే విద్యుత్‌ అందిస్తున్నారన్నారు. అదే పేద వారి గృహాలకు మాత్రం గ్రేడ్ల ఆధారంగా చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. విద్యుత్‌ సంస్థ యూనిట్‌ రూ.19 కొంటున్నట్టు చెపుతూ లాభాలు వచ్చే కంపెనీల నుంచి రూ.6.30 మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు.  గృహాలకు యూనిట్లు పెరిగే కొద్ది రూ.2 నుంచి రూ.8.50 వరకు చార్జీలు వేయటం మంచిది కాదన్నారు. పేద గృహ వినియోగదారులకు తక్కువ చార్జీలు విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


Updated Date - 2022-01-28T06:20:32+05:30 IST