ఎలక్ట్రిక్‌ కార్ల వల్ల అతి తక్కువ కర్బన ఉద్గారాలు

ABN , First Publish Date - 2020-03-25T07:51:27+05:30 IST

పెట్రోలు కార్లతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్‌ కార్ల నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌(సీఓ2) ఉదార్గాల మోతాదు చాలా తక్కువని నెదర్లాండ్‌లోని రాడ్‌బౌండ్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో నిరూపితమైంది.

ఎలక్ట్రిక్‌ కార్ల వల్ల అతి తక్కువ కర్బన ఉద్గారాలు

లండన్‌, మార్చి 24 : పెట్రోలు కార్లతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్‌ కార్ల నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌(సీఓ2) ఉదార్గాల మోతాదు చాలా తక్కువని నెదర్లాండ్‌లోని రాడ్‌బౌండ్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో నిరూపితమైంది. ఇందులోభాగంగా ప్రపంచాన్ని 59 ప్రాంతాలుగా విభజించి అక్కడి వాహనాల్లో ఏ తరహా ఇంధనాలు వాడుతున్నారు? వాటి నుంచి ఎంత మోతాదులో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి? అనేది విశ్లేషించారు. ఎలక్ట్రిక్‌ కార్లు నడిచేందుకు విద్యుత్‌ అవసరం. ఆ విద్యుత్‌ ఉత్పత్తి క్రమంలో.. దానితో ఎలక్ట్రిక్‌ కార్లు నడిచే సమయంలో విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాల మోతాదు పెట్రోలు కార్లతో పోల్చుకుంటే చాలా తక్కువని అధ్యయనంలో తేలింది. 

Updated Date - 2020-03-25T07:51:27+05:30 IST