భీమవరం బైపాస్‌రోడ్డులోని గేటు సమీపంలో దగ్ధమవుతున్న బైక్
భీమవరం క్రైం, మే 18: రోడ్డుపై వెళుతుండగా ఎలక్ట్రిక్ బైక్‌కు మంటలు వ్యాపించి దగ్ధమైన ఘటన బుధవారం సాయంత్రం బైపాస్ రోడ్డులోని గేటు సమీపంలో జరిగింది. ఎలక్ట్రిక్ బైక్‌పై భీమవరానికి చెందిన ఆదినారాయణమూర్తి వెళుతుండగా బైక్‌లో మంటలు వచ్చాయి. దీంతో ఆయన వాహనాన్ని వదిలి దూరంగా వెళ్లిపోయాడు. బైక్ పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.